• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • BUSINESS TYCOON HARSH GOENKA SHARED A VIDEO OF MONKEYS SLIDING DOWN BUILDING AND IT GOES VIRAL IN SOCIAL MEDIA GH SRD

Viral Video: హాలీవుడ్ యాక్షన్ సినిమా చూపించిన కోతులు.. ప్రముఖులు మెచ్చిన వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Viral Video: ఇటీవలి కాలంలో కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారుతున్నాయి. ఇటీవల ఢిల్లీ మెట్రోలోకి ఓ కోతి ప్రవేశించింది. కోచ్​లో కూర్చొని జర్నీని ఎంజాయ్ చేసింది. ఓ ప్యాసింజర్​లా సీట్లో ప్రశాంతంగా ప్రయాణించింది. లేటెస్ట్ గా రెండు కోతులు చేసిన యాక్షన్ స్టంట్లకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

  • Share this:
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్​ గొయెంకా ట్విట్టర్​లో చాలా యాక్టివ్​గా ఉంటారు. తన అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు కొన్నిసార్లు ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తారు. సరదా వ్యాఖ్యలు జోడిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోనే గొయెంకా ట్వీట్ చేశారు. రెండు కోతులు ఓ పెద్ద భవనం నుంచి కిందికి దిగుతున్న వీడియో అది. బిల్డింగ్​పై భాగం నుంచి ఆ కోతులు కిందికి దిగిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. వాటి స్కిల్స్​కు వారెవా అన్నారు. ముందుగా ఓ కోతి పిల్లర్​ను పట్టుకొని స్టైలిష్​గా కిందికి దిగడం ప్రారంభించగా.. మరో కోతి దాన్ని అనుసరించింది. ఆ రెండు ఎంతో సమన్వయంతో కిందకు చేరుకున్నాయి. హర్ష్​ గొయెంకా షేర్​ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే కొన్ని లక్షలకు పైగా వ్యూస్ రాగా.. వేలాది లైక్స్ వస్తున్నాయి. కోతుల స్కిల్​ను మెచ్చిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోతులకు స్పైడర్ మ్యాన్​తో పోలుస్తున్నారు. మరికొందరేమో ఏకంగా మిషన్ ఇంపాజిబుల్ అంటూ యాక్షన్ సినిమాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి మంచి వీడియోలు ఎక్కడ దొరుకుతున్నాయంటూ కొందరు నెటిజన్లు గొయెంకాను కొందరు ప్రశ్నించారు. అయితే ఈ కోతులు హాలీవుడ్​ సినిమాలు చూసి ఉంటాయని, అందుకే అంత స్టైలిష్​గా సింక్​తో బిల్డింగ్​ దిగాయని మరో యూజర్ సరదా కామెంట్ చేశాడు.

కాగా హర్ష్​ గొయెంక షేర్ చేసిన ఈ వీడియోను చూసిన కొందరు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. “నేను చిన్నతనంలో ఆడిన ఓ ఆటను ఇది గుర్తుచేస్తోంది. ఓ కోతి కర్రలను పోగు చేసుకొనివచ్చి మళ్లీ కిందకు దిగే ఆట అది. నేను వాటిని మిస్సవుతున్నా” అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. “ఇది అసలు సులువు కాదు. నేను ఓసారి ట్రైచేశా” అని మరొకరు రాసుకొచ్చారు. అలాగే ఇలాంటి థ్రిల్లింగ్ వీడియోలు తమకు ఎక్కడ దొరుకుతాయంటూ ఓ వ్యక్తి ప్రశ్నించాడు. “చాలా థ్రిల్లింగ్​గా ఉంది. ఇలాంది అద్భుతాలను మీరు ఎలా పట్టుకుంటారు. పోస్ట్ చేసినందుకు థ్యాంక్స్​. ఇలానే కొనసాగండి” అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోకు మిషన్ ఇంపాజిబుల్​ బ్యాక్​గ్రౌండ్ యాడ్ చేస్తే అదిరిపోతుందని మరో నెటిజన్​ రాసుకొచ్చాడు.






ఇటీవలి కాలంలో కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారుతున్నాయి. ఇటీవల ఢిల్లీ మెట్రోలోకి ఓ కోతి ప్రవేశించింది. కోచ్​లో కూర్చొని జర్నీని ఎంజాయ్ చేసింది. ఓ ప్యాసింజర్​లా సీట్లో ప్రశాంతంగా ప్రయాణించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
Published by:Sridhar Reddy
First published: