మూడు నెలల దాకా కావాల్సినన్ని బీర్లు ఫ్రీ.. కానీ..

మందుబాబులు ఖుషీ పడే వార్త ఇది. ముఖ్యంగా బీర్లు అంటే ప్రాణమిచ్చే వాళ్లకు శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ఓ కంపెనీ తాగినన్ని బీర్లు ఇస్తానంటోంది. అదీ ఉచితంగానే.

news18-telugu
Updated: March 30, 2020, 8:31 AM IST
మూడు నెలల దాకా కావాల్సినన్ని బీర్లు ఫ్రీ.. కానీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మందుబాబులు ఖుషీ పడే వార్త ఇది. ముఖ్యంగా బీర్లు అంటే ప్రాణమిచ్చే వాళ్లకు శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ఓ కంపెనీ తాగినన్ని బీర్లు ఇస్తానంటోంది. అదీ ఉచితంగానే. ఒక్క రోజు రెండు రోజులు కాదు.. ఏకంగా మూడు నెలల పాటు. మూడ్నెళ్ల పాటు ఎన్ని తాగితే అన్ని బీర్లు ఫ్రీగానే అందిస్తామని చెబుతోంది. అయితే.. ఇక్కడ ఓ కండిషన్ ఉంది. కుక్కను దత్తత తీసుకోవాలి. దానికి సపర్యలు చేయాలి. అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. దీంతో చాలా మంది జంతువులకు సంబంధించిన సంస్థలు మనుషులను దగ్గరకు రానివ్వడం లేదు. మనుషులతో వాటికి కరోనా సోకుతుందన్న భయం. అయితే, మిడ్ వెస్ట్ సంస్థ మాత్రం కుక్కలను దత్తత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

దాదాపు 500 కుక్కలను దత్తత ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే.. బుష్ బీర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకొని ముందడుగు వేసింది. ఎవరైతే కుక్కను దత్తత తీసుకుంటారో వారికి మూడు నెలలకు సరిపడ బీర్‌ను బుష్ బీర్ కంపెనీ ఉచితంగా అందిస్తుంది. కుక్కను దత్తత తీసుకున్న వారు.. ప్రూఫ్ కింద కుక్కతో ఫొటో దిగి బుష్ బీర్ కంపెనీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు పంపించాల్సి ఉంటుంది. ముందుగా పంపించే వారికి 100 డాలర్ల(రూ.7500) రివార్డ్ కూడా ఇస్తుంది. ఈ ఆఫర్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే ఉంటుందని ఆ బీర్ కంపెనీ తెలిపింది.

First published: March 30, 2020, 8:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading