BURGER KING TROLLS MCDONALDS FOR COPYING ITS CHILLI CHEESE BITES WITH A MEME KNOW FULL DETAILS HERE GH VB
McDonalds: మెక్‌డొనాల్డ్స్‌పై మీమ్ పోస్టు చేసిన బర్గర్ కింగ్.. తమ చిల్లీ చీజ్ బైట్స్ కాపీ చేసిందని ఆరోపణ..!
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచంలో బర్గర్లు విక్రయిస్తున్న అతి పెద్ద సంస్థల్లో బర్గర్ కింగ్ (Burger King), మెక్‌డోనాల్డ్స్ (McDonalds) ఉన్నాయి. ఈ రెండు సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది.
ప్రపంచంలో బర్గర్లు విక్రయిస్తున్న అతి పెద్ద సంస్థల్లో బర్గర్ కింగ్ (Burger King), మెక్‌డోనాల్డ్స్ (McDonalds) ఉన్నాయి. ఈ రెండు సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ క్రమంలో ఒక కంపెనీని మరో కంపెనీ ఏదైనా అంశంలో కాపీ చేస్తున్నట్లు తెలిస్తే?. ఇటీవల దీనికి సంబంధించి బర్గర్ కింగ్ యూకే ఫేస్బుక్లో ఒక పోస్ట్ (Facebook Post) చేసింది. మెక్‌డోనాల్డ్స్ సంస్థ తమ చిల్లీ చీజ్ బైట్స్ (Chilli Chese Bites)ను కాపీ చేసి మెనూలో పొందుపరిచిందని ఆరోపించింది.
ఇలా కాపీ చేయడంపై బర్గర్ కింగ్ సంస్థ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఒక మీమ్‌ను కూడా పోస్టు చేసింది. ఈ మీమ్‌లోని మొదటి వ్యాఖ్యాల్లో.. ‘నేను నీ హోంవర్క్‌ను కాపీ చేయవచ్చా?’ అని ఉంటుంది. అందుకు బదులుగా..‘చేసుకో.. అయితే కొంచెం మార్పులు చెయ్యి. కాపీ చేసినట్లు తెలియదు.’ అని ఉంటుంది.
చివరిగా మీమ్‌లో ‘ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత’ అని రాసి అక్కడ బర్గర్ కింగ్ చిల్లి చీజ్ బైట్స్ ఫొటో.. పక్కనే మెక్‌డొనాల్డ్స్ మెనూ ఉంటాయి. ఈ మీమ్‌కు బర్గర్ కింగ్ రాసిన క్యాప్షన్ ఇలా ఉంది.. ‘ఫిఫ్టీన్ ఇయర్స్‌గా మా మెనూలో ఉన్నట్లు కాదు’ అని పేర్కొంది.
ఈ విషయంలో చాలా మంది సోషల్ మీడియాలో మెక్డోనాల్డ్స్ను తప్పుబడుతున్నారు. పోటీ సంస్థ దాదాపు 15 సంవత్సరాలుగా అందిస్తున్న చిల్లీ చీజ్ బైట్స్‌ను ఇప్పుడు మెక్డొనాల్స్డ్ తమ మెనూలో పొందుపరచడం సరికాదని అంటున్నారు. పేరు మాత్రమే కాదని ఆహార పదార్థం కూడా దాదాపు ఒకేలా ఉందని చెబుతున్నారు. చివరికి రెండు సంస్థలు అందిస్తున్న చిల్లీ చీజ్ బైట్స్ ననాణ్యతను కూడా పోలుస్తూ పోస్టులు చేశారు. బర్గర్ కింగ్‌ను సపోర్ట్ చేస్తున్న వర్గం, మెక్‌డొనాల్డ్స్‌ను సపోర్టు చేస్తున్న వర్గం పరస్పర ఆరోపణలకు దిగాయి. ఓ వినియోగదారుడు మెక్‌డొనాల్డ్స్‌కు చెందిన చిల్లీ చీజ్ బైట్స్ గురించి ప్రస్తావిస్తూ..‘బర్గర్ కింగ్ అందిస్తున్న చిల్లీ చీజ్ బైట్స్‌ను మెక్‌డొనాల్డ్స్ నాణ్యత లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చింది.
బర్గర్ కింగ్ తరహాలో కాపీయర్ మెక్‌డొనాల్డ్ 20 బాక్స్ ఆప్సన్‌ను కూడా అందించడం లేదు. ఎప్పటికీ మెక్‌డొనాల్డ్స్ మంచి సేవలు అందించలేదు’. అని పేర్కొన్నారు. మరో వినియోగదారుడు ఓ కామెంట్లో..‘చాలా కాలంగా బర్గర్ కింగ్ నుంచి చిల్లీ చీజ్ బైట్స్ తింటున్న వ్యక్తిగా చెబుతున్నాను. మెక్‌డొనాల్డ్స్ అందిస్తున్న చిల్లీ చీజ్ బైట్స్ చాలా బాగున్నాయి.’ అని రాశారు.
మెక్‌డొనాల్డ్స్ యూకే ఈ వారంలో చాలా కొత్త ఐటమ్స్‌ను పరిచయం చేసింది. బర్గర్ కింగ్ అందిస్తున్న పెద్ద పెద్ద బర్గర్లను కూడా మెక్‌డొనాల్డ్స్ పరిచయం చేసింది. అదే విధంగా హోం స్టైల్ క్రిస్పీ చికెన్, చిల్లీ చీజ్ బైట్స్, క్రీమ్ ఎగ్, క్యాడ్బరీ క్యారమెల్ మెక్ఫ్లరీకి మెనూలో చోటు కల్పించాయి. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. చిల్లీ చీజ్ బైట్స్‌ను కాపీ చేయడానికి సంబంధించి పలు వార్తా సంస్థలు మెక్‌డొనాల్డ్స్ సంస్థ స్పందన కూడా కోరాయని బర్గర్ కింగ్ చెబుతోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.