Home /News /trending /

Job offer: రోజుకు రూ.59 వేలు జీతం.. ఫుడ్, బెడ్ ఫ్రీ.. దరఖాస్తుకు ఇంకా కొద్ది రోజులే గడువు.. ఎక్కడంటే

Job offer: రోజుకు రూ.59 వేలు జీతం.. ఫుడ్, బెడ్ ఫ్రీ.. దరఖాస్తుకు ఇంకా కొద్ది రోజులే గడువు.. ఎక్కడంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇక్కడ ఓ కుటుంబం కూడా ఉద్యోగ ప్రకటన (job notification) ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు వచ్చి ఉద్యోగం చేయొచ్చంట. ఆ వాళ్లు జీతం మనకి ఏం ఇస్తారులే అనుకుంటున్నారా? ఆగండాగండి... వాళ్లిచ్చే జీతం చూస్తే ఎగిరి గంతులేయాల్సిందే.

  ఉద్యోగం (job). దీనితో జీవితాలే ముడిపడి ఉంటాయి. జీవితంలో స్థిరపడటం దగ్గరి నుంచి పెళ్లి, పిల్లల వరకు జీవితం చూసుకోవాలంటే కనీసం ఏదో ఒక ఉద్యోగం ఉంటే కానీ గడవదు. ఇక కొద్దో గోప్పో ఆర్థిక పరిస్థితులు బాగుంటే బిజినెస్​ లాంటివి పెట్టుకుని జీవితంలో పైకి ఎదుగుతారు. ఈ రోజుల్లో చాలామందికి ఉద్యోగం లేనిదే పెళ్లిళ్లు కూడా అవడంలేదనే వాదనలూ ఉన్నాయి. అయితే మన దగ్గర ఉద్యోగాలు తక్కువ.. అభ్యర్థులేమో ఎక్కువ.. ఒక్కో ఉద్యోగానికి వేలల్లోనే కాంపిటీషన్​ మరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి అనుకూలత, ఖాళీలను బట్టి ఉద్యోగ ప్రకటనలు (job notification) ఇస్తుంటాయి. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఓ కుటుంబం కూడా ఉద్యోగ ప్రకటన (job notification) ఇచ్చింది.

  అర్హులైన అభ్యర్థులు వచ్చి ఉద్యోగం చేయొచ్చంట. ఆ వాళ్లు జీతం మనకి ఏం ఇస్తారులే అనుకుంటున్నారా? ఆగండాగండి... వాళ్లిచ్చే జీతం చూస్తే ఎగిరి గంతులేయాల్సిందే.. ఏకంగా రోజుకు రూ.59 వేలు ఇస్తారంట.. మరి ఇంతకీ ఆ ఉద్యోగం (job offer) ఏంటి.. ఎక్కడో ఓ లుక్కేద్దాం..

  అయితే ఇటీవల

  యూకే (UK) లోని ఎడిన్‌బర్గ్‌లో ఈ రకమైన ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ (job Notification) ఒకటి తాజాగా విడుదలైంది. డిసెంబర్‌ 22 నుంచి జనవరి 5 వరకు మొత్తం 14 రోజుల ఉద్యోగావకాశం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏమిటంత ముఖ్యమైన జాబ్‌ (job) అనే కదా అనుకుంటున్నారు..! కేర్​ టేకర్.. (care taker)ఓ సంపన్న కుటుంబం క్రిస్టమస్‌ సెలవుల్లో పిల్లల్ని చూసుకోవడానికి (children care) గాను ఈ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది.

  14 రోజులకు 9 లక్షల రూపాయల జీతం..

  ఐదేళ్ల కవల పిల్లల సంరక్షణకుగాను (For the care of twins)  రోజుకు అక్షరాల 59 వేల రూపాయల జీతం చొప్పున.. మొత్తం 14 రోజులకు 9 లక్షల రూపాయల జీతం (9 lakhs rupees salary) ప్రకటించింది సదరు కుటుంబం. క్రిస్టమస్‌ టైంలో పిల్లల్ని (children) జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఫుడ్‌, బెడ్‌ అన్నీ అక్కడే. ఈ ఉద్యోగంలో చేరిన ఆయా.. పిల్లలకు స్నానం చేయించడం (bath), ఆహారం పెట్టడం (food), వారితో ఆటలాడటం, నిద్ర పుచ్చడం.. వంటి పనులు చేయాలి. అంతేకాదు దరఖాస్తు దారులకు ఖచ్చితంగా పిల్లల సంరక్షణలో ఐదేళ్ల అనుభవం (experience) కూడా ఉండాలి. ఇది ప్రస్తుతం సోషల్​ మీడియాలో ట్రెండింగ్​గా మారుతోంది.

  గతంలోనూ ఇలాంటి బంఫర్​ ఆఫర్​ ఒకటి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ లెప్రె ఒక మిలియనీర్...వ్యాపారంలో బోర్ కొట్టేసింది. ఇంకేముంది ప్రపంచ పర్యటనలకు రెడీ అయిపోయాడు. అయితే ఒక్కడే వరల్డ్ టూర్ చేస్తే ఏం బాగుంటుందని, తనకో జోడీ కావాలని కోరుకున్నాడు.  తనకో జోడీ కావాలని ఒక బంపర్ ఆఫర్‌ను వదిలాడు. అదేంటో తెలుసా...తనతో పాటు ఎవరైతే వరల్డ్ టూర్ వస్తారో వాళ్లకు ఏడాదికి రూ.36 లక్షల జీతం ఇస్తానని ప్రకటించాడు. అంతే కాదు...వేతనంతో పాటు హెల్త్ ఇన్సురెన్స్, ఇతర పారితోషికాలు కూడా అదనంగా ఇస్తానని తెలిపాడు. ఇదంతా ఒక వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదలడంతో ఔత్సాహికులు మాథ్యూను సంప్రదించేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకూ ఏకంగా 40 వేల అప్లికేషన్లు పోటెత్తాయి.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: International news, Trending news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు