Tata Motors: ఈ 5 టాటా కార్ల పై రూ.70 వేల వరకు తగ్గింపు

ఫెస్టివల్ సీజన్‌కు ముందే టాటా మోటార్స్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీ వాహనాలపై టాటా మోటార్స్ భారీ డిస్కాంట్స్ ప్రకటించింది.

news18-telugu
Updated: October 8, 2020, 1:17 PM IST
Tata Motors: ఈ 5 టాటా కార్ల పై రూ.70 వేల వరకు తగ్గింపు
ఫొటో క్రెడిట్-టాటా మోటార్స్
  • Share this:
ఫెస్టివల్ సీజన్‌కు ముందే టాటా మోటార్స్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీ వాహనాలపై టాటా మోటార్స్ భారీ డిస్కాంట్స్ ప్రకటించింది. నెక్సాన్, టిగోర్, హారియార్, టియాగో, ఆల్ట్రోజ్ కార్లపై రూ. 70,000 వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వాహనాలను అతి తక్కువ ఈఎంఐ సౌకర్యంతో కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. తాము ఆఫర్లను ప్రకటించామని.. వినియోగదారులు వారి బడ్జెట్‌కు అనుగుణంగా కార్లను ఎంపిక చేసుకోవచ్చని టాటా మోటార్స్ తెలిపింది.

టాటా కార్లపై డిస్కౌంట్, ఈఎంఐ వివరాలు..

టాటా నెక్సాన్.. ఈ అక్టోబర్‌లో బెస్ట్ సెలింగ్ నెక్సాన్ కారుపై రూ. 20,000 వరకు డిస్కౌంట్ అందజేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా తక్కువ ఈఎంఐను కూడా వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. 5,999 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలాగే ఈ కారులో వినియోగదారులు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందించనున్నట్టు చెప్పింది.

టాటా టిగోర్.. ఇండియాస్ సేఫెస్ట్ సెడాన్ టాటా టిగోర్ కారుపై రూ. 33,000 వరకు డిస్కౌంట్ అందజేస్తుంది. అంతేకాకుండా తక్కువ ఈఎంఐను కూడా వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. 4,111 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

టాటా ఆల్ట్రోజ్.. ఇండియాలో సేఫెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుగా ఉన్న ఆల్ట్రోజ్‌పై కూడా టాటా మోటార్స్ అతి తక్కువ ఈఎంఐ ఆఫర్‌ను ప్రకటించింది. వినియోగదారులు 4,799 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

టాటా టియాగో.. బీఎస్6 నార్మ్స్‌కు అనుగుణంగా అటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన న్యూ ఇంజన్‌తో టాటా టియాగో‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ కారుపై రూ. 28,000 వరకు డిస్కౌంట్ అందజేస్తుంది. అంతేకాకుండా తక్కువ ఈఎంఐను కూడా వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. 3,555 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

టాటా హారియర్.. బీఎస్6 నార్మ్స్‌కు అనుగుణంగా అటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో టాటా హీరియర్‌ను అందజేయనున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఇది విస్తృత సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ అక్టోబర్ హారియర్ కారును కొనుగోలు చేసేవారికి మొత్తంగా రూ. 70,000 వరకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది. అంతేకాకుండా తక్కువ ఈఎంఐను కూడా వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. 12,339 రూపాయల అతి తక్కువ ఈఐఎంతో కారు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
Published by: Sumanth Kanukula
First published: October 8, 2020, 8:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading