Home /News /trending /

BULLET BANDI SONG GOES VIRAL RECENTLY PRAKASAM DISTRICT BRIDE PERFORMED SUPER STEPS TO SAME SONG NGS

Bullet Bandi: పెళ్లి వేడుకల్లో తప్పని సరి అయిన బుల్లెట్ బండి పాట.. అదరగొట్టిన మరో వధువు.. ఈ సారి ఎక్కడంటే..?

ప్రకాశంలో బుల్లెట్ బండి పాట సందడి

ప్రకాశంలో బుల్లెట్ బండి పాట సందడి

Viral Song: ఇకపై పెళ్లి వేడుకలు అంటే కచ్చితంగా బుల్లెట్ బండి సాంగ్ ఉండాల్సిందేనేమో..? ఇక వధువుకు క్వాలిఫికేషన్ అంటూ పెడితే.. ఆ పాటకు డ్యాన్స్ వచ్చా అని అడగాల్సిన పరిస్థితి ఉంటుందేమో.. ఎందుకంటే అంతలా వైరల్ అవుతోంది ఆ పాట..

  Viral Video: కొన్ని ట్రెండ్ ను ఫాలో అయితే.. మరికొన్ని ట్రెండ్ ను సెట్ చేస్తాయి.. ఆ కోవలోకే వస్తోంది నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. పాట.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా అదే పాట.. ముఖ్యంగా పెళ్లి వేడుకలు అంటే ఈ పాట తప్పని సరి అయిపోయింది. ఆ పాట లేకుంటే పెళ్లి వేడుకే లేదు అనుకునేంతంగా మారిపోయింది. ఇక పెళ్లి చేసుకుంటున్న వధువులు, త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న వధువులు అయితే ఈ పాటకు స్టెప్పులు నేర్చుకోవడం కామన్ అయ్యింది. డుగు డుగు డుగు అని వాయిస్ రాగానే వేడుక అంతా క్లాప్స్ తో మారు మోగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే ట్రెండ్ అవుతోంది. అటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బుల్లెట్ పాట మోత మోగిస్తోంది. కేవలం తెలంగాణ (Tealngana)కు మాత్రమే ఈ పాట ఇప్పుడు పరిమితం అవ్వలేదు. పక్క రాష్ట్రాల్లో సైతం ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు వధువులు.. ఈ విషయంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఇంతకాలం దాచుకున్న తమ ప్రతిభనంతా ఇలా వరుడి ముందే ప్రదర్శిస్తూ టాలెంట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్, టకాటక్, ఎంఎక్స్ వంటి షార్ట్ వీడియో అప్లికేషన్స్‌లోనూ ఈ పాటే ట్రెండ్ అవుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

  ఇక యూబ్యూట్‌లో అయితే ఈ పాట రికార్డులు అన్నీ ఇన్నీ కావు. కోట్లాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి ఈ పాట వచ్చి చాలా రోజులు అవుతుంది. కేవలం ఇన్‏స్టా రీల్స్‏లో ట్రెండింగ్‏లో ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు పెళ్లి బరాత్‏లో రచ్చ చేస్తోంది. ఇటీవల ఓ పెళ్లి కూతురు తన పెళ్లి బరాత్‏లో ఈపాటకు డ్యాన్స్ చేయడంతో ఈ పాటకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఒక్క డ్యాన్సుతో ఆ పెళ్లికూతురు ఫేమస్ అయ్యింది. ఆ జంట సెలబ్రిటీ అయిపోయింది. వరుస వారికి ఆపర్ల వర్షం కురుస్తోంది. ఆ వదువు స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ వధువుకు సాంగ్ నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. తమ సంస్థలో వచ్చే తరువాత పాటకు ఆమెతో ఒప్పందం చేసుకున్నారు. ఇక ఈ పాటకు వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ స్టెప్పులేస్తున్నారు.

  తాజాగా ఈ పాటకు మరో నవ వధువు స్టెప్పులెసింది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం కురాకువారి పల్లెలో పెళ్లి కూతురు బుల్లెట్‌ బండి పాటకు డ్యాన్స్‌ చేసి అందరిని ఆకట్టుకుంది. పెళ్లి కూతురు తన స్లైలో స్టెప్పులెస్తూ కేక పుట్టించింది. ఆర్మీలో పనిచేస్తున్న శ్రీకాంత్‌ను తేజశ్రీ అనే అమ్మాయి ఈనెల 27వ తేదిన పెళ్లాడింది. ఈ సందర్బంగా పెళ్ళి కూతురు తేజశ్రీ బుల్లెట్‌ బండి పాటకు పెళ్ళికొడుకు ముందు స్టెప్పులేయడంతో బంధువులు చప్పట్లతో ఎంకరేజ్‌ చేశారు… ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 
  ఇటీవల మహబూబాబాద్ ఎంపీ మాలోత్‌ కవిత  సైతం ఒక వివాహ వేడుకలో బుల్లెట్‌ బండి పాటకు ఆడిపాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత.. నూతన వధూవరులతో పాటు వారి కుటుంబసభ్యులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తన డ్యాన్స్‌తో అక్కడన్న వారందరిని అలరించారు. ఎంపీ డాన్స్‌ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: After marriage, Andhra Pradesh, AP News, Prakasam, VIRAL NEWS, Viral vide

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు