Bullet Bandi Song: బుల్లెట్ బండి సాంగ్‌కు స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారి.. జూనియర్ సాయి పల్లవి అంటూ నెటిజన్ల కామెంట్..

(Image- Youtube)

ఇప్పుడు ఎక్కడ చూసిన బుల్లెట్ బండి.. పాటే వినిపిస్తోంది. చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లుగా, కాలర్ ట్యూన్స్‌గా, పెళ్లి వేడుకల్లో.. ఇలా ఎక్కడ చూసిన ఈ పాటే మారుమోగుతోంది.

  • Share this:
    నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... అంటూ సాగుతున్న ఈ పాటు సోషల్ మీడియాలో దుమ్ములేపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ పాటే వినిపిస్తోంది. కొద్ది నెలల కిందట మోహన భోగరాజు పాడిన ఈ పాటకు.. ఇటీవల పెళ్లి బారాత్‌లో ఓ పెళ్లి కూతరు స్టెప్పులేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ పాటకు ఫుల్ క్రేజీ పెరిగింది. చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లుగా, కాలర్ ట్యూన్స్‌గా, పెళ్లి వేడుకల్లో.. ఇలా ఎక్కడ చూసిన బుల్లెట్ బండి పాటే మారుమోగుతోంది.  పాటకు ఫుల్ క్రేజ్‌ ఉండటంతో చాలా మంది ఆ పాటకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఓ నర్సు కూడా బుల్లెట్ బండి సాంగ్‌కు చిందేయడం వైరల్‌గా మారిన సంగతి తెలిసందే. టీఆర్‌ఎస్ ఎంపీ మాలోత్ కవిత(Maloth Kavitha) సైతం ఈ పాటకు డ్యాన్స్ చేశారంటే.. క్రేజ్ ఏ రేంజ్‌లో  ఉందో అర్థం చేసుకోవచ్చు.

    యూట్యూబ్‌లో బుల్లెట్ బండి(Bullet Bandi) అని టైప్‌ చేస్తే పదుల సంఖ్యలో కవర్ సాంగ్‌లు దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లలు సైతం.. బుల్లెట్ బండి సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు మాత్రమే జనాలకు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.



    Bullet Bandi Bride Dance: బారాత్‌లో డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన వధువు.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే.. వధూవరుల గురించిన వివరాలు ఇవే..

    తాజాగా ఓ చిన్నారి బుల్లెట్ బండి సాంగ్‌కు వేసిన స్టెప్పులు ఇప్పుడు జనాల మనసును దోచేస్తున్నాయి. Nainika Thanaya అనే యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నైనికా(Nainika) అనే పాప సింగిల్ టేక్‌లో‌నే డ్యాన్స్ చేసినట్టుగా ఈ వీడియో టైటిల్‌లో పేర్కొన్నారు. పాప మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో.. పాటలోని పదాలకు తగ్గట్టుగా స్టెప్పులు వేసింది. పాప డ్యాన్స్ చేస్తున్నంత సేపు.. లిరిక్స్ పాడుతూనే కనిపించింది. చాలా అనుభవం ఉన్న డ్యాన్సర్‌లా విజృంభించిందనే చెప్పాలి.





    పాప వేసిన స్టెప్పులు మాత్రం అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాప డ్యాన్స్ బాగా చేసిందని.. భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని చాలా మంది శుభకాంక్షలు తెలుపుతున్నారు. కొందరైతే జూనియర్ సాయిపల్లివి అంటూ పాప డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు నైనిక, తన్య అనే మరో పాపతో కలిసి బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో కూడా  భారీగా వ్యూస్ సొంతం చేసుకుంది.

    గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బుల్లెట్ బండి సాంగ్‌దే హవా నడుస్తోంది. ఇక, లక్ష్మణ్ అందమైన సాహిత్యం అందించిన ఈ పాటను.. మోహన భోగరాజు(Mohana Bhogaraju) కూడా అంతే అందంగా పాడారు. ఈ అద్బుతమైన పాటకు ఎస్ కే బాజీ సంగీతం సమకూర్చారు.
    Published by:Sumanth Kanukula
    First published: