మంగళసూత్రం మింగేసిన ఎద్దు.. ఖరీదు రూ.లక్షన్నర

ఆగస్ట్ 30న ఈ ఘటన జరిగినప్పటి నుంచి వారు ఆ ఎద్దును ఇంటి దగ్గరే కట్టేసి.. పేడ వేసిన ప్రతిసారీ తీసి చెక్ చేశారు.

news18-telugu
Updated: September 13, 2019, 6:39 PM IST
మంగళసూత్రం మింగేసిన ఎద్దు.. ఖరీదు రూ.లక్షన్నర
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ ఇల్లాలి మంగళసూత్రాన్ని ఎద్దు మింగేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో పశువుల పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. సంప్రదాయంగా వచ్చే ఈ వేడుకల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ ఇంట్లో ఉండే ఎద్దులను అందగా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ముస్తాబు చేసిన ఎద్దులను ఇంటింటికీ తిప్పుతారు. ఎద్దులు ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు.. వాటికి పూజలు చేస్తుంది. ఆ సందర్భంగా తమ వద్ద ఉండే బంగారాన్ని ఆ ఎద్దుల ముఖాలకు తాకిస్తుంది. అలా చేస్తే తమ అదృష్టం బాగుంటుందని వారి నమ్మకం. ఓ గ్రామంలో మహిళ అలాగే, తమ ఇంటి ముందుకు వచ్చిన ఎద్దుకు తన మంగళసూత్రాన్ని తాకించింది. అయితే, అదే సమయంలో వారింట్లో కరెంటు పోయింది. మంగళసూత్రం, మరికొన్ని వస్తువులను ప్లేట్‌లోనే ఉంచి.. ఆ ఇల్లాలు ఇంట్లోకి వెళ్లింది. క్యాండిల్ వెలిగించి బయటకు వచ్చేసరికి ఆమె మంగళసూత్రం కనిపించకుండా పోయింది.

చీకట్లో ఎవరైనా దొంగతనం చేసి ఉంటారని వారు తొలుత అనుమానించారు. అయితే, ఎద్దులకు బియ్యంతో చేసిన పిండిపదార్థాలు పెడతారు. మంగళసూత్రంతోపాటు ఆ పిండిపదార్థాలు కూడా పళ్లెంలో లేవు. దీంతో వారికి ఎద్దు తినేసి ఉంటుందని అనుమానం వచ్చింది. ఆగస్ట్ 30న ఈ ఘటన జరిగినప్పటి నుంచి వారు ఆ ఎద్దును ఇంటి దగ్గరే కట్టేసి.. పేడ వేసిన ప్రతిసారీ తీసి చెక్ చేసేవారు. కానీ, వారం రోజులు గడిచినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో గ్రామస్తుల సూచన మేరకు ఓ వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఓ మెటల్ డిటెక్టర్ సాయంతో వెటర్నరీ డాక్టర్ చెక్ చేయడంతో ఆ మంగళసూత్రం ఎద్దు కడుపులోనే ఉందని నిర్థారణ అయింది. సెప్టెంబర్ 8న ఎద్దుకి ఆపరేషన్ నిర్వహించి, కడుపులో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీశారు. రూ.1.5లక్షల విలువైన మంగళసూత్రం వారికి దక్కింది. ఎద్దుకు ఆపరేషన్ చేసినందుకు రూ.5000 ఖర్చయింది. ఓ నెల, రెండు నెలల పాటు ఎద్దు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారట.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading