హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Adilabad:అల్లుడికి పిల్లతో పాటు వాటిని కట్నం ఇచ్చారు.. ఇక మనోడి పని దున్నుడే దున్నుడు

Adilabad:అల్లుడికి పిల్లతో పాటు వాటిని కట్నం ఇచ్చారు.. ఇక మనోడి పని దున్నుడే దున్నుడు

(అల్లుడూ ఇక దున్నుకోపో..)

(అల్లుడూ ఇక దున్నుకోపో..)

Variety Wedding Gift: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పెళ్లి వేడుకలో కట్నం కింద అత్తమామలు కొత్త అల్లుడుకి రెండు ఎద్దులతో పాటు ఓ ఎడ్లబండిని కానుకగా ఇచ్చారు. అత్తమామలు ఇచ్చిన ఎద్దులబండిపైనే భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు అల్లుడు.

పెళ్లిళ్లు జరిగే విధానం మారుతున్నట్లుగానే పెళ్లిలో వరుడికి వధువు తల్లిదండ్రులు ఇచ్చే కట్న, కానుకలు మారుతూ వస్తున్నాయి. అయితే ఇది వేర్వేరు ప్రాంతాల్లో వేరు వేరుగా ఉంటోంది. గతంలో అయితే కొత్త అల్లుడికి కారు, బైక్‌, గోల్డ్ చైన్ ఇలా ఏదో ఖరీదైన వస్తువును కానుకగా ఇస్తూ వచ్చేవాళ్లు. ఇప్పుడు మాత్రం ఆ ట్రెండ్ పూర్తిగా మార్చేస్తున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. ఎక్కడో సంగతి పక్కన పెడితే తెలంగాణలోని ఆదిలాబాద్‌( Adilabad)జిల్లాలో ఓ ఆడపిల్ల తండ్రి కూతురికి ఘనంగా పెళ్లి చేసి అల్లుడికి పెళ్లి కానుకగా రెండు ఎద్దుల(Bulls)తో పాటు ఎడ్లబండి(Bull cart)ని ఇచ్చాడు. ఉట్నూర్ (Utnoor)మండలం దొంగచింత (Dongachinta thanda)గ్రామానికి చెందిన పెందూర్‌ లచ్చు, బారుబాయి దంపతుల కుమార్తె లింగబాయిని ఉట్నూర్ మండలం చింతకర్ర గ్రామానికి చెందిన కుమ్ర జుగాదిరావ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆదివాసి వివాహ వేడుకలో అత్తమామలు, అల్లుడుకి పెళ్లికి కట్నం (Wedding dowry)కింద రెండు ఎద్దులు, ఎడ్లబండి కట్నకానుకగా ఇచ్చారు. అల్లుడికి పెళ్లి సమయంలో అత్తమామలు ఇచ్చిన వస్తువులు చూసి మొదట ఆశ్చర్యపోయిన స్థానికులు ఆ తర్వాత హర్షం వ్యక్తం చేశారు. లింగబాయి,కుమ్ర జుగాదిరావ్‌ వివాహం ఆదివాసీ సాంప్రదాయల ప్రకారం జరిగింది. వధువరులను డోలు, వాయిద్యాల మధ్య కల్యాణ వేదిక దగ్గరకు తెచ్చారు అమ్మాయి తరపు బంధువులు. వివాహానంతరం అమ్మాయిని అప్పగించినట్లుగానే అల్లుడు కుమ్ర జుగాధిరావ్‌కు పెళ్లి మండపంలోనే రెండు జతల ఎడ్లు.. ఓ ఎడ్లబండిని అందంగా అలంకరించి అప్పగించారు.

కట్నం ఇవ్వడంలో నయా ట్రెండ్..

కట్నం కింద వచ్చిన జోడెద్దులు, ఎద్దుల బండిని నూతన దంపతులు జుగాదిరావు-లింగుబాయి పూజ చేశారు. ఆ తర్వాత అదే బండిపైన పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు ఉట్నూర్ మండలంలోని చింతకర్ర గ్రామంలోని మెట్టినింటికి తీసుకెళ్లాడు కొత్త పెళ్లికొడుకు. పెళ్లి చేసుకొని వచ్చిన కుమ్ర జుగాధిరావ్‌ కట్నం కింద ఎద్దులు, ఎడ్లబండిని తీసుకురావడం చూసి అతని తల్లిదండ్రులు సంతోషించారు.

అల్లుడికి ఆదివాసీ అత్త,మామల కానుక..

పెళ్లిళ్లు పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలుగా జరుపుకుంటున్నారు. ఈవెంట్‌ వెడ్డింగ్, డెస్టినేషన్‌ వెడ్డింగ్, ట్రెడిషనల్ వెడ్డింగ్, ఆన్‌లైన్‌ వెడ్డింగ్ తరహాలోనే ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త రకం కట్న కానుకలు ఇస్తూ కొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తున్నారు ఆదివాసీ బిడ్డలు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉట్నూర్‌ మండలంలోనే కాదు మరికొన్ని గ్రామాల్లో కూడా ఈ తరహాలోనే ఎడ్లబండ్లను కట్నం కింద ఇస్తూ నూతన సాంప్రదాయానికి తెర తీస్తున్నారు ఆదివాసీలు.

Published by:Siva Nanduri
First published:

Tags: Adilabad, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు