Fact Check: బీర్‌ ప్లాంట్‌‌లో 12 ఏళ్లుగా యూరిన్ పోస్తున్న బడ్వైజర్ ఉద్యోగి...నిజమా?

సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.  బడ్వైజర్ బీర్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి 12 ఏళ్లుగా బీర్ ట్యాంకులో తాను మూత్రం పోస్తున్నట్లు వెల్లడించారన్నది ఆ వార్తా కథనం సారాంశం.

news18-telugu
Updated: July 2, 2020, 5:42 PM IST
Fact Check: బీర్‌ ప్లాంట్‌‌లో 12 ఏళ్లుగా యూరిన్ పోస్తున్న బడ్వైజర్ ఉద్యోగి...నిజమా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.  బడ్వైజర్ బీర్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి 12 ఏళ్లుగా బీర్ ట్యాంకులో తాను మూత్రం పోస్తున్నట్లు వెల్లడించారన్నది ఆ వార్తా కథనం సారాంశం. ఆ ఉద్యోగి తన పేరును వాల్టెర్ పావెల‌గా వెళ్లడించాడు. తమ ప్లాంట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని బడ్వైజర్ బీర్ ప్లాంట్స్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా...తాము ఎప్పుడు యూరిన్ పోవాలనుకుంటే అప్పుడు బీర్ ట్యాంకులో పోసేందుకు అనుమతులు ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. తన దగ్గర ఎవరైనా బడ్వైజర్ బీర్ బాగుంటుందని అంటే...వారిని చూసి తనకు జాలేస్తుందని పేర్కొన్నాడు. వాట్సప్ గ్రూప్స్‌లో ఈ వార్తా కథనం చక్కర్లు కొట్టడంతో మద్యం ప్రియులు పరేషాన్ అయ్యారు. తాము ఎంతో ఇష్టపడే బీర్‌ను ఇక ఎలా తాగాలంటూ బిక్కమొహంపెట్టారు.

beer urine, budveiser beer, viral news, international funny news, humour news, బడ్వైజర్ బీరు, బీరు యూరిన్, బీరు మూత్రం
ప్రతీకాత్మక చిత్రం


అయితే ఈ వైరల్ కథనంపై జరిగిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ కథనాన్ని ప్రచురించిన వెబ్‌సైట్ సెటైరికల్స్ కథనాలను ప్రచురిస్తుంటుందని తేలింది. ఇందులో పలు అవాస్తవ కథనాలు ప్రచురించగా...బడ్వైజర్ బీర్ కంపెనీ ఉద్యోగి బీర్ ప్లాంట్‌లో 12 సంవత్సరాలుగా మూత్రం పోస్తున్నట్లు పేర్కొన్నట్లు ప్రచురించిన కథనం కూడా అవాస్తవమేనని తేలింది. ఈ కథనం చివర్లో ఇది ఫేక్ న్యూస్‌గా ఆ వెబ్‌సైట్ పేర్కొనడం విశేషం.

ఆర్టికల్ చివర్లోని డిస్కైమర్‌ను చదవకుండానే...ఈ వార్త నిజమని ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు నెటిజన్స్. ‘ఈ వెబ్‌సైట్‌ను వినోదం, హాస్యం పంచేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని కథనాలు ఊహాజనితమైన, అవాస్తవదూరమైనవి’ అంటూ అందులో పేర్కొన్నారు.

సదరు వెబ్‌సైట్‌లో వచ్చిన అవాస్తవ కథనాన్ని నిజమని భావించి మదనపడుతున్న మందుప్రియులకు మా కథనం కాస్త ఊరట కలిగించేదే..
First published: July 2, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading