ఆర్థిక రంగంలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న మోదీ సర్కారు.. ఈ సారి బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.10 లక్షల కన్నా ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే పన్ను విధించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని తగ్గించేందుకు, డిజిటల్ పేమెంట్లను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్యాక్స్ రిటర్నులకు ఉపయోగపడేందుకు వీలుగా హైవాల్యూ లావాదేవీలకు Aadharను అనుసంధానం చేసేలా నిబంధన తీసుకురావాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.50వేల కంటే ఎక్కువ లావాదేవీలకు బ్యాంకులు PAN నంబరును అడుగుతున్నాయి. దాని స్థానంలో ఆధార్ నంబర్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది.
ఇక, యూపీఏ ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టి 2009లో తీసేసిన బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(బీసీటీటీ)ని కూడా మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అన్నింటి కంటే కీలకమైనదంటంటే.. అత్యధికంగా ట్యాక్స్ కట్టే వ్యక్తులు ప్రధాని మోదీతో చాయ్ తాగే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:June 10, 2019, 15:56 IST