చైనాలో మరో కొత్త వ్యాధి... డ్రాగన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు

చైనా రాన్రానూ వైరస్‍‌ల దేశంగా మారిపోతోందంటున్న నెటిజన్లు... నెక్ట్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు...

news18-telugu
Updated: July 6, 2020, 3:20 PM IST
చైనాలో మరో కొత్త వ్యాధి... డ్రాగన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు
చైనాలో మరో కొత్త వ్యాధి... డ్రాగన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు (credit - twitter)
  • Share this:
చైనాలో కరోనా వైరస్, G-4 వైరస్‌కి తోడు తాజాగా బుబోనిక్ ప్లేగు వెలుగులోకి రావడంతో... చైనాపై ప్రపంచ దేశాల ప్రజలకు ఆగ్రహం పెరిగిపోతోంది. ఇప్పటికే ఉన్నవి చాలవా... మరిన్ని తేవాలా అని సెటైర్లు వేస్తున్నారు. కొంత మంది నాలుగో మహమ్మారి కూడా చైనా నుంచే వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నారు. బుబోనిక్ ప్లేగు (Bubonic plague) కూడా కరోనా లాంటిదే. కాకపోతే... ఇది సోకితే... జ్వరం, చలి, తలనొప్పి, ఒంటిపై వాపులు, శరీరంపై పుండ్లు, లింప్ గ్రంధుల్లో నొప్పి వంటివి వస్తాయి. ఆల్రెడీ ఇది సోకిన ఓ వ్యక్తిని ఉత్తర చైనాలోని బయన్నుర్ సిటీ డాక్టర్లు గుర్తించారు. అతని ఫ్యామీలీ, చుట్టుపక్కల వారు, ఫ్రెండ్స్ అందర్నీ గుర్తించి... ఐసోలేట్ చేశారు. అందరికీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఎందుకైనా మంచిదని స్థానిక ప్రజలకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. పక్క దేశమైన మంగోలియాలో కూడా బుబోనిక్ ప్లేగు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలిసింది.


మర్మోట్ జాతికి చెందిన ఎలుక మాంసం తిన్న ఇద్దరికి ముందుగా ఈ వ్యాధి సోకిందని చైనా అధికారిక వార్తా సంస్థ జున్హువా... జులై 1న చెప్పింది. ఆ ఇద్దరికీ చెందిన వారు, కాంటాక్ట్ అయినవారు మొత్తం 146 మందిని పట్టుకుపోయారు. అందరికీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. 2020 ముగియడానికి ఇంకో ఆరు నెలలు టైమ్ ఉంది. ఈలోగా మరిన్ని వైరస్‌లు చైనా నుంచి వస్తాయనే నమ్మకంతో ఉన్నారు చాలా మంది నెటిజన్లు. ఎందుకంటే... ఈ కొత్త వ్యాధికి జారీ చేసిన ప్రమాద హెచ్చరికను ఈ ఏడాది చివరి వరకూ కొనసాగిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.


ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా సెటైర్ వేశారు. జాలి చూపాలి. ఇలాంటి మరిన్ని వార్తలు వినేందుకు నేను సిద్ధంగా లేను అని క్యాప్షన్ పెట్టారు. ఇంకా చాలా మంది ఇలాంటివి పెడుతూ... సోషల్ మీడియాను సెటైర్లతో నింపేస్తున్నారు.


ప్లేగు వ్యాధి మూడు రకాలు. బుబోనిక్ ప్లేగు వాటిలో ఒకటైపు. ఎర్సినియా పెస్టిన్ అనే బ్యాక్టీరియా దీన్ని వ్యాపింపజేస్తోంది. ఇది ఎలుకలు, గుమ్మడి పురుగుల్లో ఉంటుంది. వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా... అలా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఆ ఎలుకల్ని ఆ ఇద్దరూ తిన్నారు కదా... అందువల్ల ఆ బ్యాక్టీరియా వాళ్లలో దూరింది.


ఎన్ని వైరస్‌లు దాడి చేస్తున్నా చైనా తీరు మారట్లేదు. ఇప్పటికీ అక్కడి ప్రజలు పురుగులు, గబ్బిలం జ్యూస్, కుక్క మాంసం, అడవి జంతువుల మాంసం, సముద్ర పాములు ఇలాంటి అన్నీ తింటూనే ఉన్నారు.


చైనాను వైరస్‌ల దేశం అని అమెరికా సహా ప్రపంచ దేశాలు తిట్టిపోస్తున్నా... చైనీయులకు చీమ కూడా కుట్టట్లేదు. కుడితే దాన్నీ తినేసే రకం వాళ్లు.


ఇప్పుడీ కొత్త బ్యాక్టీరియాకి చెక్ పెట్టకపోతే... ఇది మరో డేంజర్ అయ్యే ప్రమాదం ఉంది. ఐతే... బ్యాక్టీరియా కంటే వైరస్‌లు ఎక్కువ ప్రమాదకరం. కాబట్టి... ఈ బ్యాక్టీరియా ప్రపంచమంతా పాకే అవకాశాలు లేవనే అనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading