• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BROTHER AND SISTER HAVE HONOURED THEIR DADS LAST WISH OF POURING HIS ASHES DOWN THE DRAIN OF HIS FAVOURITE PUB SRD

Viral : బీరులో తండ్రి అస్థికలు..డ్రైనేజీలో కలిపిన కొడుకు..ట్విస్ట్ ఏంటంటే...

Viral : బీరులో తండ్రి అస్థికలు..డ్రైనేజీలో కలిపిన కొడుకు..ట్విస్ట్ ఏంటంటే...

Photo Credit : Caters

Viral : మన భారతదేశంలో చనిపోతే సాధారణంగా అస్థికలు ఏ పవిత్ర నదీ జలాల్లోనో కలుపుతుంటారు. దీని వల్ల వారి ఆత్మకు విముక్తి లభిస్తోందని నమ్మకం. ఇతర దేశాల్లో కూడా సముద్రాల్లో, నదుల్లో కలుపుతుంటారు.

  • Share this:
    మన భారతదేశంలో చనిపోతే సాధారణంగా అస్థికలు ఏ పవిత్ర నదీ జలాల్లోనో కలుపుతుంటారు. దీని వల్ల వారి ఆత్మకు విముక్తి లభిస్తోందని నమ్మకం. ఇతర దేశాల్లో కూడా సముద్రాల్లో, నదుల్లో కలుపుతుంటారు. కానీ, ఇక్కడ ఓ కొడుకు మాత్రం తన తండ్రి అస్థికల్ని డ్రైనేజీలో కలిపాడు. అయితే, అతడు అంతటితో ఆగలేదు. అస్థికలు కలిపిన ఆ బీరును.. పబ్ డ్రైనేజీలో పోశాడు. అదేంటీ అతడికి ఏమైనా పిచ్చా అనుకుంటున్నారా. అయితే, ఇలా కలపడం వెనుక ఓ ట్విస్ట్ ఉంది. వివరాల్లోకెళితే.. కెవిన్‌ మెక్‌గ్లిన్చికి కోవెంట్రీలోని "హోలీ బుష్‌" పబ్‌ అంటే ఎంతో ఇష్టం. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. చల్లగా ఓ గ్లాసు బీరు పుచ్చుకునేవాడు. చావు దగ్గర పడ్డ కొద్దిరోజుల ముందు కుటుంబసభ్యుల్ని ఓ పిచ్చి చివరి కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత అస్థికలను పబ్‌ ముందున్న డ్రైనేజీలో కలపాలన్నాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అతడి కోరికను అర్థంచేసుకున్నారు. మొదటి జయంతి రోజున కెవిన్‌ కుమారుడు ఓవెన్‌, కూతురు కాస్సిడీ ఇతర కుటుంబసభ్యులు హోలీబుష్‌ పబ్‌ దగ్గరకు చేరుకున్నారు.

    ఓవెన్‌ తండ్రి అస్థికలను ఓ గ్లాసు బీరులో కలిపి, దాన్ని పబ్‌ముందున్న డ్రైనేజీలో పారబోశాడు. దీంతో తండ్రి చివరి కోరిక తీరింది. దీనిపై ఓవెన్‌ మాట్లాడుతూ.. "మా నాన్నకు హోలీ బుష్‌ పబ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. అక్కడి డ్రైనేజీలో తరచూ ఏదో ఒకటి పాడేసేవాడు. అవి ఎలాంటివంటే జుట్టు, గోర్లు లాంటివి. డ్రైనేజీలో ఆయన తన అస్థికలు ఎందుకు కలపమన్నారంటే.. మేము అటువైపు వెళ్లిన ప్రతీసారి గుర్తుకురావాలన్న ఉద్దేశ్యంతో" అని పేర్కొన్నారు.

    అంతేకాదు.. కెవిన్ మరో వింత కోరిక కూడా కోరాడు. చనిపోయిన తర్వాత తన తల వెంటుకలను కూడా పబ్‌ డ్రైనేజీలో కలపాలని తెలిపాడు. అతడు చెప్పినట్లే అతడి కొడుకు, కూతురు అస్థికలతోపాటు కలిపారు.
    Published by:Sridhar Reddy
    First published: