BRITISH MAN WORKS FOR 70 YEARS WITHOUT TAKING SINGLE SICK LEAVE PVN
Viral Story : నువ్వు దేవుడివి బాసూ..70ఏళ్లుగా ఒక్క లీవ్ కూడా తీసుకోని ఉద్యోగి
70 ఏళ్లుగా సిక్ లీవ్ తీసుకోని ఉద్యోగి
Man Works Without sick leave : మారిన వాతావరణ పరిస్థితులు,ఆహార అలవాట్లు,జీవన విధానం కారణంగా నేటి రోజుల్లో దాదాపు అందరూ అప్పుడప్పుడూ అనారోగ్యానికి గురవుతుండటం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఉద్యోగులు అప్పుడప్పుడు సిక్ లీవ్ లు తీసుకోవడం తెలిసిందే. అయితే ఓ ఉద్యోగి మాత్రం తన 70 ఏళ్ల ఉద్యోగ సర్వీస్ లో
No Sick leave : ఏదైనా సంస్థకి అత్యంత విలువైన ఆస్తి తన నమ్మకమైన ఉద్యోగులే. ఏ కంపెనీ లేదా సంస్థలోని ఉద్యోగస్తులు అయినా ప్రతీ వారం వీక్లీ ఆఫ్..అప్పుడప్పుడూ రకరకాల కారణాలతో సెలవులు తీసుకోవడం సర్వసాధారణం. అనారోగ్య కారణాలతో ఉద్యోగులు సిక్ లీవ్ లు తీసుకోవడం కూడా సర్వసాధారణమే. మారిన వాతావరణ పరిస్థితులు,ఆహార అలవాట్లు,జీవన విధానం కారణంగా నేటి రోజుల్లో దాదాపు అందరూ అప్పుడప్పుడూ అనారోగ్యానికి గురవుతుండటం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఉద్యోగులు అప్పుడప్పుడు సిక్ లీవ్ లు తీసుకోవడం తెలిసిందే. అయితే ఓ ఉద్యోగి మాత్రం తన 70 ఏళ్ల ఉద్యోగ సర్వీస్ లో ఒక్కటంటే..ఒక్క సిక్ లీవ్(అనారోగ్య కారణాలతో సెలవు) కూడా తీసుకోకుండా పనిచేశారు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అయితే ఆ ఉద్యోగి ఎవరు?అతనికి ఇది ఎలా సాధ్యమైంది?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అది 1953 ఎండాకాలం. ఇంగ్లాండ్ లోని సమర్సెట్ లోని క్లార్క్స్ షూ ఫ్యాక్టరీలో బ్రియాన్ ఛార్లీ అనే వ్యక్తి ఉద్యోగంలో చేరాడు. అప్పుడు ఛార్లీ వయస్సు 15ఏళ్లు. అప్పటికి స్కూల్ లో చదువుకుంటున్నప్పటికీ..పేదరికం వలన తతెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా చిన్న వయస్సులోనే ఉద్యోగంలో చేరినప్పటికీ..తన ఉద్యోగం,తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ పట్ల ఛార్లీకి విపరీతమైన గౌరవం ఉండేది. పనినే దైవంగా భావించేవాడు. అయితే తాను ఉద్యోగంలో చేరిన కంపెనీ 1980లో కొన్ని కారణాల వల్ల మూసివేయడింది. దీంతో ఛార్లీ డబ్బుల కోసం వేరే వేరో ఉద్యోగాలు చేశారు.
అయితే 1993లో తాను మొదట ఉద్యోగం చేసిన కంపెనీ ఓ షాపింగ్ ఔట్ లెట్ ను ప్రారంభిస్తున్న విషయం ఛార్లీకి తెలిసింది. దీంతో మళ్లీ తాను మొదట పనిచేసిన ఆ కంపెనీలోనే తిరిగి ఉద్యోగంలో చేరాడు. అప్పుడు ఛార్లీ వయస్సు 50ఏళ్లు. తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి అద్భుతమైన సేవలు అందించాలని ఎప్పుడూ మనస్సులో అనుకోవడమే కాకుండా ఆచరణలో పెట్టాడు. దాదాపు 70ఏళ్లుగా ఒక్క సిక్ లీవ్ కూడా తీసుకోకుండా పనిచేస్తున్నాడు ఛార్లీ. ప్రస్తుతం ఛార్లీ వయస్సు 83 ఏళ్లు. తనకు ఇప్పట్లో రిటైర్డ్ అయ్యే ఉద్దేశ్యం కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో ఛార్లీ చెప్పడం విశేషం.మరో 93 ఏళ్లు తనకు పనిచేయాలని ఉంది అని ఛార్లీ చెబుతున్నారు. అయితే 70 ఏళ్లుగా ఒక్క సిక్ లీవ్ కూడా తీసుకోకుండా పనిచేయడం ఛార్లీకి ఎలా సాధ్యమైందబ్బా అని ఆలోచించేవారు కొందరైతే..ఉద్యోగం పట్ల నీకున్న అంకితభావం,ఉద్యోగం ఇచ్చిన కంపెనీ పట్ల నీకున్న అమితమైన ప్రేమ,గౌరవానికి హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు ఈయన గురించి తెలిసినవాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.