Guinness World Record: నిజంగా ఇది అద్భుతమే.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు.. ఎలా సాధ్యం అంటే..

ఒక్క చెట్టుకు 839 పండ్లు

తోటపనిపై అభిరుచితో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వంటివి అలవాటు చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అయితే మొక్కలు పెంచడంపై ఆసక్తి పెంచుకున్న ఒక వ్యక్తి.. పంట దిగుబడులపై వినూత్న ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కొత్త పద్ధతులతో ఒక టమాట చెట్టు కొమ్మకు ఏకంగా 839 టమాటాలు పండించాడు ఇంగ్లాండ్‌కు చెందిన డగ్లస్ స్మిత్ అనే వ్యక్తి.

  • Share this:
తోటపనిపై అభిరుచితో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వంటివి అలవాటు చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అయితే మొక్కలు పెంచడంపై ఆసక్తి పెంచుకున్న ఒక వ్యక్తి.. పంట దిగుబడులపై వినూత్న ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కొత్త పద్ధతులతో ఒక టమాట చెట్టు కొమ్మకు ఏకంగా 839 టమాటాలు పండించాడు ఇంగ్లాండ్‌కు చెందిన డగ్లస్ స్మిత్ అనే వ్యక్తి. దీంతో ఒకే టమాటా చెట్టు కొమ్మకు అత్యధిక సంఖ్యలో టమాటాలు పండించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Weight loss: అధిక బరువు నుంచి బయటపడేందుకు డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..


ఇంతకుముందు ఈ రికార్డు గ్రాహం టాంటర్ అనే వ్యక్తి పేరుతో ఉంది. అతడు 2010 లో 448 టమాటాలను ఒకే చెట్టు కొమ్మకు పండించాడు. స్మిత్ పండించిన టమాటాలు చెర్రీ టమాట రకానికి చెందినవి. వీటి రుచి చెర్రీ పండ్ల మాదిరిగా ఉంటుంది. ఈ పండ్లను స్నాక్స్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.

ఒక ఐటీ కంపెనీలో పనిచేసే స్మిత్‌కు మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టమట. ఈ అభిరుచితోనే టమాట పంట రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడట. తన ప్రయత్నానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కిందని ఇటీవల ట్వీట్ చేశారు స్మిత్. ‘ఒకే చెట్టు కొమ్మకు అత్యధిక టమాటాలు పండించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాను.


Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


ఈ రోజు మేము టమాటా చెట్టు కొమ్మకు కాసిన పండ్లను కోసి లెక్కించాం. మొత్తం 839 టమాటాలు కాశాయి. గతంలో 488 టమాటాలు పండించిన గ్రహం టాంటర్ పేరుతో ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది. ప్రస్తుతం గిన్నిస్ రికార్డ్స్ ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నాను’ అని స్మిత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Constable Triangle: అతడు కానిస్టేబుల్.. తల్లీ, కూతుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే..


తాను ఈ ఏడాది మార్చిలో టమాట విత్తనం నాటినట్లు చెప్పారు స్మిత్. దాని సంరక్షణకు వారానికి మూడు నుంచి నాలుగు గంటలు కేటాయించినట్లు తెలిపారు. గ్రీన్‌హౌజ్‌ విధానంలో నాటడం వల్ల ఈ చెట్టు చీడపీడల బారిన పడలేదని వెల్లడించారు. గతంలోనూ మొక్కల పెంపకంతో ఒక రికార్డు సాధించారు స్మిత్. బ్రిటన్‌లో 6.5 పౌండ్ల (3.1 కిలోల) అతిపెద్ద టమాటాను పండించి గత ఏడాది వార్తల్లో నిలిచారు. దీని చుట్టుకొలత ఏకంగా 27.5 అంగుళాలు ఉండటం విశేషం.
Published by:Veera Babu
First published: