news18-telugu
Updated: December 2, 2020, 6:26 PM IST
ప్రతీకాత్మక చిత్రం (Image; AFP)
‘‘విమానంలో శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా?.. అయితే నాకు కొంత డబ్బు చెల్లించి మీకు నచ్చిన విధంగా నాతో గడపండి.” అంటూ బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన గుర్తు తెలియని ఒక ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ పోస్టు ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో కలకలం రేపుతోంది. విమానంలో వ్యభిచారం చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే కాకుండా తాను బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫోటోలను పంచుకుంది. వైరల్‌గా మారిన ఈ విషయంపై బ్రిటిష్ ఎయిర్వేస్ స్పందిస్తూ వెంటనే విచారణకు ఆదేశించింది. దీనిపై బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రతినిధి మాట్లాడుతూ, "మా సహోద్యోగులందరి నుంచి ఎప్పటికప్పుడు అత్యున్నత ప్రవర్తనను ఆశిస్తున్నాం. ఈ విషయంపై విచారణ చేపట్టాం.’’ అని పేర్కొన్నారు.
విచారణకు ఆదేశించిన బ్రిటిష్ ఎయిర్వేస్..దీనితో ఆగకుండా తన లోదుస్తులను కూడా అమ్ముతానని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. తన లోదుస్తులను 25 పౌండ్ల స్టెర్లింగ్ (సుమారు రూ .2,500)లకు విక్రయిస్తానని పేర్కొంది. ఒకవేళ తనను ఏదైనా హోటల్లో కలవాలనుకుంటే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాక, తనను ముందుగా కలిసి మాట్లాడాలనుకుంటే మాత్రం ఎంట్రీ ఫీజు కింద 50- పౌండ్ల స్టెర్లింగ్ రుసుము చెల్లించాలని తెలిపింది. అయితే, మీరు కలవాలనుకున్న ప్లేస్‌ను బట్టి కూడా రేటులో మార్పులుంటాయని ఎటువంటి బేరసాలాలు ఉండవని తేల్చి చెప్పింది. ‘నేను పని కోసం హోటల్ బుక్ చేసుకుంటే, అక్కడే మన మీటింగ్ కూడా జరుగుతుంది’ అని ఆమె తన పోస్ట్‌లో వివరించింది. ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన పోస్టులను తొలగించింది.
ఆశ్చర్యకరంగా కొందరు ఫాలోవర్స్ మాత్రం ఆమె చేసిన పనికి మద్దతు తెలుపుతున్నారు. ఆమె ఆఫర్స్‌పై వారు స్పందిస్తూ "ఆమె స్పష్టంగా వ్యభిచారం చేస్తోంది. బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో తీసిన ఫోటోలను ఉపయోగించుకొని తన వ్యాపారాన్ని పెంచుకుంటోంది. ఇందులో తప్పేముంది?” అంటూ ఆమెకు మద్ధతు పలికారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 2, 2020, 6:24 PM IST