Viral video: పెళ్లిలో వధువు తండ్రి పుష్ప సినిమాలోని పాటకు రచ్చ చేశాడు. మాస్ స్టెప్పులు వేస్తు అతిథులందరిని షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Oo antava Mava OO antava Mava Song In Wedding: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలకు సోషల్ మీడియాలో ఏమాత్రం కొదువలేదని చెప్పుకొవచ్చు. ప్రతి రోజు వివాహానికి సంబంధించి.. ఏదో ఒక స్పెషల్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. వెడ్డింగ్ ను చాలా మంది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైన రెడిగా ఉంటారు. ప్రీవెడ్డింగ్ షూట్, హల్దీ, రంగోలీ, పెళ్లి.. ఇలా ప్రతి వేడుక గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ వేసుకుంటారు. దీని కోసం రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు. తమ స్నేహితులు, అతిథులు, బంధువులు మధ్య వేడుకలను ఎంతో స్పెషల్ గా చేసుకుంటారు.
సోషల్ మీడియాలో అనేక రకాల పెళ్లి వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికోన్ని ఆశ్చర్యకరంగాను ఉంటాయి. ఇక పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగిన సరదా సన్నివేశాల వలన ఇవి వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల.. వీటిని పబ్లిసిటీ కోసమో.. మరేంటో కానీ పెళ్లిలో ఏదో ఒక ఫన్ క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. పెళ్ళిలో వధువు.. వేదికపై బుల్లెట్ బండీమీద, పల్లకిలో, క్రేన్ సహాయంతో వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన అనేక పెళ్లి వీడియోలు వైరల్ గా మారాయి.
ఇక తాజాగా ఈ మధ్య విడుదలైన పుష్ప సినిమా ఎఫెక్ట్ పెళ్లిళ్ల మీద కూడా ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అల్లు అర్జున్, రశ్మిక మందాన్న హీరో హీరోయిన్లుగా చేసిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని శ్రీవల్లిపాట, ఊ అంటావా.. ఊ ఊ అంటావా పాట సోషల్ మీడియా, యూట్యూబ్ లను షేక్ చేసింది. ఇక ఈ సినిమాలోని తగ్గెదేలే.., పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటివా.. ఫైర్.. అనే డైలాగ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఊ అంటావా.. ఊ ఊ అంటావా పాట, పాట సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఒక పెళ్లి వేడుకలో వధువు తండ్రి.. ఈ పాటకు హట్ స్టెప్పులు వేస్తు అంతదరిని షాకింగ్ గురిచేశాడు. లిరిక్స్ కు తగ్గట్టుగా.. డ్యాన్స్ చేస్తు చూసే వారందరిని కట్టి పారేశాడు. బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకుని, మస్త్ గా డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.