పెళ్లిళ్లు సంప్రదాయ పద్దతిలో జరుపుకుంటూనే వేడుకలు మాత్రం వినూత్నంగా జరుపుకుంటున్నారు. పెళ్లి మండపానికి లేదా ఫంక్షన్ హాలుకు వరుడు, వధువులను ఊరిగింపుగా తెచ్చే సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో కారు, గుర్రం, ఏనుగు, బైక్, హెలికాప్టర్‌లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు(Bridegroom)ను బంధు,మిత్రుల మధ్య మేళా, తాళాలు వాయించుకుంటూ తీసుకొచ్చే వారు. కాని ట్రెండ్ మారుతోంది కాబట్టి థింక్ డిఫరెంట్ అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే గుజరాత్(Gujarat)లో ఓ పెళ్లికొడుకును వధువు ఇంటికి జేసీబీ(JCB)పై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ వార్త, వీడియో సామాజిక మాధ్యమా(Social media)ల్లో విస్తృతంగా వైరల్ (viral)అవుతోంది. ఇలా కూడా పెళ్లి కొడుకును తీసుకెళ్తారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
జేసీబీలో వధువు ఇంటికి వరుడు..
పెళ్లి కొడుకు వివాహం చేసుకునేందుకు పెళ్లి కూతురు ఇంటికి మందీ, మార్బలం, బంధు, మిత్రులతో ఎంతో దర్జాగా కారులో వెళ్లడం చూశాం. కానీ గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలోని కలియారి గ్రామానికి చెందిన కేయూర్ పటేల్ మాత్రం పెళ్లి కొడుకుగా ముస్తాబై తనకు ఎంతో ఇష్టమైన జేసీబీ వాహనంపై ఊరేగింపుగా వెళ్లాడు. జేసీబీకి ముందు ఉండే ప్రొక్లెయిన్‌ని క్యాబిన్‌గా మార్చి దాన్నే డెకరేట్ చేసి అందులో కూర్చున్నాడు కేయూర్ పటేల్. నూతన వరుడు ఈవిధంగా జేసీబీలో వస్తుంటే వెనుక, ముందు బంధువులు, కుటుంబ సభ్యుల వాహనాలు ఫాలో అయ్యాయి. ఇక అబ్బాయికి గ్రాండ్ వెల్‌కమ్ పలుకుతూ డేజీ సౌండ్స్ మధ్య డ్యాన్సులు చేసుకుంటూ వధువు ఇంటికి చేరుకున్నాడు.
వెరైటీ ఎంట్రీతో అంతా షాక్ ..
పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో జరిగే అత్యంత మధుర ఘట్టాల్లో వివాహం అత్యంత ముఖ్యమైనది. అందుకే పెళ్లి సమయంలో ఎవరైనా తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తారు. పెళ్లి దుస్తుల దగ్గర నుంచి భోజనాలు, వేడుకల్ని కూడా తమకు నచ్చినట్లుగా ప్లాన్ చేసుకుంటారు. అయితే గుజరాత్‌కు చెందిన కేయూర్ పటేల్ ఈవిధంగా జేసీబీలో పెళ్లి మండపానికి వెళ్లాలనే కోరికను తీర్చుకోవడం చూసి స్థానికులు మొదట ఆశ్చర్యపోయారు. అయితే అందరూ ఆలోచించినట్లుగా కాకుండా కాస్త భిన్నంగా, వినూత్నంగా ఆలోచించడం చూసి స్థానికులు ఇలా కూడా ఊరేగింపుగా వస్తారా అంటూ చిత్ర, విచిత్రంగా మాట్లాడుకున్నారు.
వైరల్ అవుతున్న వీడియో..
కేయూర్ పటేల్ ఊరేగింపుగా వస్తుంటే విచిత్రంగా అనిపించి ..వీడియోలు తీశారు. ఇంత వెరైటీ ఆలోచన వచ్చిదంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈవిధంగా పెళ్లి కూతురు ఇంటికి వెళ్లడం తప్పు కాదు..ఎవరికి ఇబ్బంది కలిగించకపోవడంతో నెటిజన్లు కూడా వాటే ఐడియా గురూ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujrath news, Viral Video, Wedding