వామ్మో.. 100 కిలోల లెహంగా ధరించిన పెళ్లికూతురు.. నివ్వెరపోయిన అతిథులు.. వీడియో వైరల్..

లెహంగా ధరించిన పెళ్లి కూతురు

సాధారణంగా పెళ్లి సమయంలో తామే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని కోరుకుంటారు వధువులు. ఇందుకు వినూత్న అలంకరణ పద్ధతులను ఎంచుకుంటారు. అయితే పెళ్లి కోసం ఏకంగా 100 కేజీల బరువైన లెహంగా కుట్టించుకుంది ఓ పాకిస్తానీ పెళ్లి కూతురు. ఈ వెడ్డింగ్ డ్రెస్‌తోనే ఆమె పెళ్లి మండపంలోకి విచ్చేసింది. దీంతో పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

  • Share this:
సాధారణంగా పెళ్లి సమయంలో తామే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని కోరుకుంటారు వధువులు. ఇందుకు వినూత్న అలంకరణ పద్ధతులను ఎంచుకుంటారు. అయితే పెళ్లి కోసం ఏకంగా 100 కేజీల బరువైన లెహంగా కుట్టించుకుంది ఓ పాకిస్తానీ పెళ్లి కూతురు. ఈ వెడ్డింగ్ డ్రెస్‌తోనే ఆమె పెళ్లి మండపంలోకి విచ్చేసింది. దీంతో పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అతిపెద్ద లెహంగా ధరించి వధువు నడుస్తుంటే.. అతిథులు ఊపిరిబిగబట్టి మరీ చూశారు. ఈ లెహంగా కుట్టించడానికి ఎన్నిరోజులు పట్టిందో తెలియదు కానీ.. అది ధరించడానికి వధువుకి కచ్చితంగా చాలా సమయం పట్టే ఉంటుంది. ఇక లెహంగా తయారీకి ఎంత ఖర్చయిందో తెలియరాలేదు.  పెళ్లి కూతురు భారీ లెహంగాతో అతిథుల దృష్టిని ఆకర్షించిప్పటికీ.. వరుడు మాత్రం గోల్డెన్ షేర్వాణీ, మెరూన్ కలర్ త‌ల‌పాగా ధరించి చాలా సింపుల్ గా కనిపించాడు. పెళ్లి స్టేజ్ అంతా వధువు లెహంగానే ఆక్రమించింది. దీంతో వివాహ వేడుకలు జరుగుతున్నంతసేపు.. అక్కడి ఆడవారు లెహంగా గురించే మాట్లాడుకున్నారు.

కొందరు తమ ఫోన్ కెమెరాలతో ఈ అద్భుతమైన దృశ్యాన్ని రికార్డ్ చేశారు. అంతే కాకుండా వాటిని ఇంటర్నెట్ లో షేర్ చేశారు. దీంతో ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్లు కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతున్నారు. పెళ్లిడ్రెస్ ధరించాల్సిన వధువు.. పెళ్లి టెంట్ ధరించిందేంటి? అంటూ కొందరు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. అబ్బో, ఈ వధువు వ్యవహారం మామూలుగా లేదుగా.. అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వెడ్డింగ్ డ్రెస్‌ తమకు బాగా నచ్చిందని కామెంట్లు పెడుతున్నారు యువతులు. ఈ భారీ లెహంగా కారణంగా స్టేజ్‌ని ఊడ్చే పని తప్పింది అంటూ మరికొందరు ఫన్నీ జోకులు పేలుస్తున్నారు.

‘ఒక డ్రెస్సే ఈ రేంజ్ లో ఉందంటే ఇక పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగి ఉంటుందో ఊహించుకోండి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ వీడియో గత ఏడాదిలోనే నెట్టింట ప్రత్యక్షం కాగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏది ఏమైనా, అంత బరువైన లెహంగా ధరించిన పెళ్లికూతురి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published by:Veera Babu
First published: