కొత్త ఒక వెర్రిలా తయారవుతోంది. బర్త్ డే, పెళ్లి వేడుకల్లో తుపాకులు పట్టుకొని డ్యాన్స్‌లు వేయడం, గన్స్ పట్టుకొని ఊరేగింపులో పాల్గొనడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇంత వరకు ఓకే కాని ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో జరిగిన ఓ రిసెప్షన్లో అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఏకంగా పెళ్లి కూతరు చేతికి తుపాకి ఇచ్చి కాల్పులు జరిపించారు బంధువులు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వందలాది మంది వచ్చి ఆనందంగా గడుపుతున్న సమయంలో తుపాకీ తూటాలు పేల్చడం ఏమిటని అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఉత్తరప్రదేశ్ ఖగారియా(Khagaria)లో ఈ ఘటన జరిగింది. భరత్‌ఖండ్(Bharatkhand)కి చెందిన అశిఫ్రాజా(Ashif Raja)కు ఈనెల 5వ తేదిన నవ్‌గాచియా(Navangachia)లోని బల్హాలో మ్యారేజ్ జరిగింది. వివాహం చేసుకొని పెళ్లి కూతుర్ని మెట్టినింటికి వచ్చింది. ఈసంద్భంగా మే 10వ తేదిన భరత్ఖండ్లో రిసెప్షన్(Reception)ఏర్పాటు చేశారు. బంధు, మిత్రులను ఆహ్వానించారు. రిసెప్షన్ వేదికపై నూతన వధు, వరులు ఉన్నారు. ఇంతలో ఓ యువకుడు తుపాకి (Gun)తెచ్చి పెళ్లి కూతురు(Bride)చేతిలో పెట్టాడు. తుపాకి పైకి గురి పెట్టి కాల్చమన్నాడు. అందుకు కొత్త పెళ్లి కూతురు కాస్త సిగ్గుపడటంతో..ఆ యువకుడే స్వయంగా చేతిలో తుపాకి పెట్టి తానే కాల్పులు(Firing)జరిపించాడు. సందడిగా జరుగుతున్న ఫంక్షన్లో ఒక్కసారిగా తుపాకీ తూటా పేలడంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
రిసెప్షన్లో తుపాకి కాల్పులు..
రిసెప్షన్ జరుగుతుంటే ఈ తుపాకుల గోలేంటని అక్కడికి వచ్చిన వృద్ధులు, పిల్లలు హడలిపోయారు. పెళ్లి కొడుకు సైతం కాస్త భయపడి వెనక్కి వెళ్లినప్పటికి నూతన పెళ్లి కూతురు మాత్రం తుపాకీని చేతిలో పెట్టి కాల్పులు జరిపిస్తుంటే దుపట్టా సర్దుకొని బుల్లెట్స్ పేల్చింది. తూటాలు పేలిన శబ్ధం రావడంతో ముసిముసి నవ్వులు కురిపించింది.
పెళ్లి కూతురే ఫైరింగ్ ..
రిసెప్షన్ పేరుతో అందరూ ఆవిధంగా ఎంజాయ్ చేస్తే స్థానికులు మాత్రం ఈ తుపాకులు కాల్చే సంప్రదాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తుపాకీ పైకి గురిపెట్టి కాల్చడం వల్ల ప్రమాదం తప్పింది కాని..ఒకవేళ గురి తప్పి ఎవరికైనా తగిలి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇలాంటి వీడియోలు చూస్తున్న అధికారులు పెళ్లి వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇదే సంప్రదాయ పునరవృతం అవుతుందంటున్నారు. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది..కాల్చిన వాళ్లకు గన్ పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video, Wedding