కిBride wants guests to pay for food : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో ఫన్నీ పోస్ట్‌లు తరచుగా షేర్ చేయబడతుంటాయి. ఇటీవల రెడ్డిట్ గ్రూప్‌లో "వెడ్డింగ్‌షేమింగ్" పేరుతో ఒక ఫేస్ బుక్ పోస్ట్ స్క్రీన్‌షాట్ షేర్ చేయబడింది. ఇప్పుడు ఇది చాలా వైరల్‌గా మారింది. ఈ స్క్రీన్ షాట్ లో.. ఒక వధువు(Bride) ఫేస్‌బుక్‌లో అతిథులు(Guests) ఆహారం కోసం డబ్బు చెల్లించాలని కోరినట్లు పెట్టింది. వధువు తన పోస్ట్ లో..."ఎవరైనా డబ్బు తీసుకొని పెళ్లిలో వారి అతిథులకు భోజనం పెడతారా? ఈ రోజుల్లో ప్రతిదీ చాలా ఖరీదైనదిగా మారింది. అక్టోబరులో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేస్తాం, లేదంటే అతిథులను పిలవం లేదా మా అతిథుల నుంచి ఫుడ్ కోసం డబ్బు తీసుకుంటాం, అది వారి బహుమతిగా పరిగణించబడుతుంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు కాబట్టి నేను అందరికీ ఆహ్వానాలు పంపాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి, నేను చాలా బాధగా,విచారంగా ఉన్నాను"అని తెలిపింది.
పోస్ట్‌పై ప్రజల స్పందన
వధువు పోస్ట్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలిపారు. పెళ్లికూతురు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు సమర్థించారు. చాలా మంది దీనిని వ్యతిరేకించారు. అతిధుల దగ్గర డబ్బులు తీసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదని, ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తనకు ఇష్టమైన హోటల్ కు వెళ్లి తిండికి కూడా అంతే డబ్బు వెచ్చిస్తున్నాడని అంటున్నారు.
Student : పరీక్ష పాస్ చేయండి సార్.. ఎగ్జామ్ పేపర్ కి రూ.500 పిన్ చేసిన స్టూడెంట్,చివరికి..
మరోవైపు,దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral news) మారింది. పసుపు రంగు టీషర్ట్ ధరించి,సీటుపై పడుకుని ఉన్న వ్యక్తి... తన నోటిలో సిగరెట్ పెట్టుకుని దమ్ముకొడుతున్నాడు. ఈ ధుమాపానంకు పాల్పడిన వ్యక్తి గురుగ్రామ్ లో ఉండే బాబీ కటారియాగా ఎయిర్ వేస్ అధికారులు గుర్తించారు. అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడని , ఇతనికి లక్షల్లో మంది ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో ఇది కాస్త డీజీసీఎ అధికారుల వరకు వెళ్లింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ గాలిలో ప్రమాదం జరిగిఉంటే.. ఎంతటి ఘోరం జరిగి ఉండేదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని సింధియా ట్వీట్‌లో హామీ ఇచ్చారు. భారత వాయు భద్రతా నియమాల ప్రకారం, తెలియని వారికి, దేశీయ విమానాలలో ధూమపానం అనుమతించబడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Marriage, Viral post