Home /News /trending /

BRIDE REFUSES TO MARRY WITHOUT GETTING A PICTURE CLICKED WITH VICKY KAUSHAL GOES VIRAL VIDEO PAH

ప్లీజ్ అతనంటే నాకు క్రష్.. ఆ ఒక్క పనిచేయనియండి.. కింద వరుడు వెయిట్ చేస్తున్నాడు.. వధువు వీడియో వైరల్..

పెళ్లిలో రచ్చ చేస్తున్న యువతి

పెళ్లిలో రచ్చ చేస్తున్న యువతి

Wedding video: పెళ్ళి వేడుకలలో భాగంగా యువతి అందంగా ముస్తాబైంది. కొత్త నగలు, కాస్ట్యూమ్స్ వేసుకుంది. మరికొన్ని గంటల్లో జయమాల కార్యక్రమం జరుగుతుంది. ఇంతలో తన హోటల్ లోని మరోక గదికి వెళ్లింది.

మనలో చాలా మంది సెలబ్రీటీలు, పొలిటిషియన్ లంటే చాలా ఇష్టపడుతుంటారు. వీరితో కలవడానికి, కరచాలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. మనం వీరు సినిమా షూటింగ్ లు, ఇతరాత్ర వేడుకలకు , షాపింగ్ ఓపెనింగ్ లకు వస్తుండటం మనకు తెలిసిందే. అలాంటి సమయాల్లో వీళ్లను ఫ్యాన్స్ లు సెల్ఫీఫోటోల కోసం తెగ సతాయిస్తుంటారు. కొన్ని సార్లు.. అతిగా కూడా ప్రవర్తించి, సెలబ్రీటిలకు, రాజకీయ నాయకులకు ఇబ్బందులకు కూడా గురిచేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఫన్నీ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఒక హోటల్ లో యువతి పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. పెళ్లి కూతురు గ్రాండ్ గా రెడీ అయ్యింది. ఆమె అందంగా ఆభరణాలు, కాస్ట్యూమ్స్ లను వేసుకుంది. అయితే.. మరికొంత సేపట్లో వరమాల కార్యక్రమం జరుగుతుంది. ఇంతలో ఆమె దిగిన రూమ్ గదికి దగ్గరలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశాల్ (vicky kaushal)  కూడా దిగారని ఆమెకు తెలిసింది. అతడంటే.. వధువుకు ఎంతో ఇష్టం. వెంటనే అక్కడికి వాలిపోయింది.



తనను.. విక్కీతో కలిసేలా చూడాలనికోరింది. తనతో ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నానని చెప్పింది. మరికొద్దిసేపట్లో తన పెళ్లని, విక్కీతో ఒక ఫోటో (Selfie photo) దిగి.. వెళ్లిపోతానని చెప్పింది. తాను.. సమయానికి వెళ్లకపోతే.. పెళ్లి కాదని.. అక్కడి సెక్యురిటీతో తన బాధను చెప్పుకుంది. మీరే... చెప్పండి..నా పెళ్లి కాకుంటే.. మీకు బాధగా ఉండదా.. అని వారిని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో (viral video) తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా నేటి ఇంటర్నెట్ కాలంలో ఎప్పటికప్పుడు అనేక ఇంట్రెస్టింగ్ వీడియోలు వెలుగులోకి వస్తూ నెటిజన్లు ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. అయితే కొందరిలో ఉండే అద్భుతమైన టాలెంగ్ ఒక్కోసారి ఆలస్యంగా బయటకి వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి రావడంతో వ్యక్తులలో దాగి ఉన్న ప్రతిభ(Talent) వేగంగా బయటి ప్రపంచానికి ఈజీగా తెలిసే అవకాశం కలుగుతోంది. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసే పనిని కూడా ఈ ఇంటర్నెట్ ప్రపంచం చేస్తుంది. రాత్రికి రాత్రే చాలా మందిని స్టార్‌ని చేస్తుంది. అలాంటి మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆవు పేడతో(Cow Dung) ఓ మహిళ గోడపై పిడకలు కొడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral) అవుతోంది. గోడ ఎత్తులో ఉన్నప్పటికీ చాలా ఈజీగా వరుస క్రమంలో అతికేలా పేడ ముద్దలను విసురుతున్న మహిళను చూపి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Trending video, Vicky Kaushal, Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు