Viral Video: పెళ్లి వేడుక.. కొత్త జంటను ఎత్తుకున్నారు.. పడిపోతానేమోనని భయంతో వధువు చేసిన పనికి..

తనను ఎత్తుకోగానే కింద పడిపోతానేమోనని భయపడిపోయిన వధువు..

ఈ మధ్యనే ఓ పెళ్లి వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదేమీ కావాలిన తీసిన వీడియో కాదండోయ్. అచ్చంగా నిజమైన పెళ్లిలో ఓ పెళ్లికూతురు అనుకోకుండా చేసిన ఓ పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందీ అనుకుంటున్నారా..?

  • Share this:
    ఈ మధ్యనే ఓ పెళ్లి వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం వల్ల వరుడికి ఆగ్రహం వచ్చి అతడిని కొట్టడంతో వధువు కింద కూర్చుని మరీ నవ్వసాగింది. ఈ వీడియో క్లిప్ కాస్తా నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే ఇది ఓ సినిమా షూటింగ్ కు సంబంధించిన వీడియో అనీ, దీన్ని వైరల్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఆ వీడియోలో ఉన్న అమ్మాయే నెట్టింట పెట్టడంతో ఓ క్లారిటీ వచ్చేసింది. కావాలనే తీసినా, సోషల్ మీడియాలో నెటిజన్లకు బోలెడు నవ్వులను పూయించింది. తాజాగా అలాంటిదే మరో వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదేమీ కావాలిన తీసిన వీడియో కాదండోయ్. అచ్చంగా నిజమైన పెళ్లిలో ఓ పెళ్లికూతురు అనుకోకుండా చేసిన ఓ పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందీ అనుకుంటున్నారా..? అయితే కింద ఉన్న ఈ వీడియోను ఓ లుక్కేయండి.



    పైన ఉన్న వీడియోను చూశారు కదా. పెళ్లన్నాక చాలా సంప్రదాయాలను పాటిస్తుంటారు. ప్రాంతానికో సంప్రదాయం, కులానికో వ్యవహారం అన్నట్టుగా ఆచారాలు ఉంటుంటాయి. మరి పైన ఉన్న వీడియోలో జరుగుతున్న పెళ్లిలోనూ ఓ ఆచారం ఉందనకుంటా. సరదాకి చేశారో, ఆచారమో ఏమో కానీ కొందరు వధువును, మరికొందరు వరుడిని చెరోవైపు ఉండి పైకి లేపారు. వరుడిని కొద్దిగా పైకి లేపి వెంటనే దింపేశారు. వధువు తరపు వారు మాత్రం ఆమెను ఎక్కువసేపు పైనే ఉంచారు. ఈ క్రమంలోనే ఆ వధువు కాస్త కంగారుకు లోనయింది. పడిపోతానేమోనన్న భయంతో పక్కనే తనను ఎత్తుకున్న ఓ వ్యక్తి తలపై చేయి పెట్టింది. ఇంకా భయం పెరిగిందనకుకంటా, అతడి జుట్టును పట్టుకుంది.

    వదువు తన జుట్టును పట్టుకోవడంతో అతడు వెంటనే నోరెళ్లబెట్టాడు. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. చివరకు ఎలాగోలా ఆమెను కిందకు దించారనుకోండి. ఈ క్రమంలోనే వధువు అతడి జుట్టు పట్టుకోవడం, ఆ యువకుడి రియాక్షన్ కు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను శ్రీమాంతి దే అనే మహిళ తన ఫేస్ బుక్ ఖాతాలో మూడు రోజుల క్రితం పోస్ట్ చేసింది. ’మహాకాళిలా మారిన నవవధువు‘ అనే క్యాప్షన్ తో పెట్టిన ఆ వీడియోను దాదాపు 8వేల మంది షేర్ చేశారు. ఆరు వేల మంది వరకు లైక్ చేశారు. ఈ వీడియో కింద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.
    Published by:Hasaan Kandula
    First published: