Viral News:  సర్పంచ్​గా ఎన్నికై అత్తారింటికి హెలికాప్టర్​లో వచ్చిన కోడలు.. గ్రామస్థుల ఘన స్వాగతం

ప్రతీకాత్మక చిత్రం

సర్పంచ్​గా గెలిచిన అనంతరం పుట్టింటి నుంచి అత్తారింటికి హెలికాప్టర్​లో చేరుకుంది ఓ కోడలు... ఈ క్రమంలో గ్రామస్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఉత్తర ప్రదేశ్ బరేలీలో జరిగిన ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

  • Share this:
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఊరికి సర్పంచ్​ కావాలంటే రూ.లక్షల కొద్ది ఖర్చు చేయడమే కాదు.. ఆ ఊరిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. కానీ ఒక మహిళ మాత్రం ఎటువంటి క్యాంపెయిన్​ చేయకుండానే తన అత్తగారి ఊరిలో సర్పంచ్​గా గెలిచి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. అంతేకాదు, సర్పంచ్​గా గెలిచిన అనంతరం పుట్టింటి నుంచి అత్తారింటికి హెలికాప్టర్​లో చేరుకుంది. ఈ క్రమంలో గ్రామస్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఉత్తర ప్రదేశ్ బరేలీలో జరిగిన ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒదౌన్ నగర​ బిజెపి ఉపాధ్యక్షుడు వేద్రామ్ లోధి కూతురు సునీతా వర్మ గతేడాది డిసెంబర్‌లో బరేలీ జిల్లా అలంపూర్​ కోట్​ గ్రామానికి చెందిన ఓమేంద్ర సింగ్​ను రిజిస్టర్​ మ్యారేజ్​ చేసుకున్నారు.

తన అత్తగారి గ్రామంలో సర్పంచ్​గా పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం ఎవరైనా అభ్యర్థి సర్పంచ్​గా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో ఓటర్​గా నమోదై ఉండాలి. ఈ కారణంగా ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడే ముందే ఓమేంద్ర సింగ్​ను వివాహం చేసుకొని చట్టబద్దంగా ఓటర్‌గా​ నమోదు చేసుకుంది. అయితే ఆ సమయంలో హిందూ ఆచారాల ప్రకారం తాళిబొట్టు కట్టి వివాహం చేసుకోకపోవడం గమనార్హం.





హెలికాప్టర్​లో అత్తారింటికి..

ఉత్తరప్రదేశ్​ గ్రామ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడటంతో ఆమె సర్పంచ్​గా నామినేషన్​ దాఖలు చేసి.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎటువంటి ప్రచారం చేయలేదు. ప్రచార బాధ్యతలన్నీ ఆమె భర్త, కుటుంబ సభ్యులు మాత్రమే చూసుకున్నారు. ఎట్టకేలకు, ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. దీంతో, భర్త పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఆమెను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్​ను ఏర్పాటు చేశాడు. హెలికాప్టర్​లో గ్రామానికి చేరుకున్న ఆమె కోసం గ్రామస్థులు, స్థానికులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆమె అత్తారింటికి వచ్చాక, హిందూ సాంప్రదాయాల ప్రకారం మరోసారి వివాహం జరిపించారు. కాగా ఆమె మామ శ్రీపాల్ లోధి గతంలో బ్లాక్ హెడ్​గా పనిచేశారు. ఆమె అత్తగారు గతంలో రెండుసార్లు సర్పంచ్​గా ఎన్నికయ్యారు.


ఇది చూడండి..
Published by:Krishna Adithya
First published: