Viral Video: ఫొటోగ్రాఫర్ చేసిన పనికి వరుడిని నీటిలోకి నెట్టేసిన వధువు.. అసలేం జరిగిందంటే..

వరుడిని నీటిలో తోసేసిన వధువు (Image credit : intagram)

పెళ్లికూతురు అందంగా ముస్తాబైన పెళ్ళికొడుకుని, ఓ ఫొటోగ్రాఫర్‌ని నీటి కొలనులోకి నెట్టేసింది. అంతేకాదు తానేదో ఘనకార్యం చేసినట్లు పగలబడి నవ్వుతూ కనిపించింది. దీంతో ఈ వధువు చేసిన పనిని చూసి నెటిజన్లు సైతం నవ్వుకుంటున్నారు.

  • Share this:
పెళ్లి వేడుకలలో వధూవరులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో వధూవరులు ఫొటోషూట్స్ అంటూ మరింత చిలిపి చేష్టలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెళ్లి క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోయేలా సరదా పనులు చేస్తున్నారు. వీరు చేసే సరదా పనులు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరొక వెడ్డింగ్ వీడియో నెట్టింట దర్శనమిచ్చింది. ఈ వీడియోలో పెళ్లికూతురు అందంగా ముస్తాబైన పెళ్ళికొడుకుని, ఓ ఫొటోగ్రాఫర్‌ని నీటి కొలనులోకి నెట్టేసింది. అంతేకాదు తానేదో ఘనకార్యం చేసినట్లు పగలబడి నవ్వుతూ కనిపించింది. దీంతో ఈ వధువు చేసిన పనిని చూసి నెటిజన్లు సైతం నవ్వుకుంటున్నారు. ఈ వీడియోని హెప్గుల్5 అనే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఫొటోగ్రాఫర్ చేసిన పని వల్ల వధువుకు చిర్రెత్తుకొచ్చిందట్లు ఈ క్లిప్‌లో కనిపించింది. అదేంటో గానీ.. ప్రతి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కూడా తమకు తాము గొప్ప సినిమాటోగ్రాఫర్లలా ఫీలవుతుంటారు.

వీరు వధూవరులను చిత్రవిచిత్ర ఫోజుల్లో నిల్చోబెట్టి ఫొటోలు తీస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఫొటోగ్రాఫర్ వధూవరులను కష్టతరమైన పోజులో నిల్చోబెట్టి ఫోటో తీయాలి అనుకున్నాడు. కానీ అతగాడు చేసిన పనికి వరుడు బలయ్యాడు. ఈ వీడియోలో వధూవరులు ఒక చిన్న కొలను మధ్యలో ఉన్న వేదికపై ఫొటోషూట్ ప్లాన్ చేయడం చూడొచ్చు. ఫొటోగ్రాఫర్ లాంగ్ షాట్ నుంచి ఒక ఫొటో తీశాడు. అనంతరం పైన ఉన్న చెక్క అంచున నిల్చొని 'ది డిప్ వెడ్డింగ్ పోజు' లో ఉండాలని సూచించాడు. నిజానికి ఈ భంగిమలో ఉండి ఫొటోకి ఫోజ్ ఇవ్వడం అనేది చాలా కష్టం.








View this post on Instagram






A post shared by hepgul5 (@hepgul5)





ఇది చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ వధువు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వరుడు మాత్రం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీంతో ఫొటోగ్రాఫర్ చెప్పగానే వరుడు ఓకే చెప్పేసి వధువుని పోజుకు రెడీ కావాలంటే ఏదో వివరించబోయాడు. దీంతో అహ్హా, అలాగా అంటూ వధువు వరుడితో సహా ఫొటోగ్రాఫర్ ని నీటి లోకి నెట్టేసింది. దీంతో టిప్ టాప్‌గా రెడీ అయిన వరుడు నీటిలో తడిసి ముద్దయ్యాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై ఫొటోగ్రాఫర్ నీళ్లు ఉన్న ప్రదేశంలో ఫొటోలు చేయడానికి సాహసించడని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Veera Babu
First published: