Viral Video: పెళ్లిలో వధువు చేసిన పనికి అందరూ షాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో..

పెళ్లి వేడుకలోని దృశ్యం (Image Credit : Instagram)

పెళ్లి అనేది అటు మహిళలకు అయినా ఇటు పురుషులకు అయినా జీవితంలో ఒక్కసారి జరిగే మహత్తరమైన కార్యక్రమం. దీంతో రెండు జీవితాలు ఒక్కటై.. ఒకే ఆలోచనతో ముందుకు సాగుతారు. అయితే వీరిద్దరికి ముడి వేసేది.. పెళ్లిలో వరుడు కట్టే తాళి. అయితే వరుడు తాళి చేతిలో పట్టుకొని వధువు మెడలో కడుతుండగా.. ఆమె దానిని కోపంతో నేలకేసి కొట్టింది. ఎందుకు ఇలా చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తాం..

  • Share this:
    పెళ్లి(Marriage) అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం. వివాహం అనే పదానికి పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానం, కల్యాణం, సప్తపది అనేక అర్ధాలున్నాయి. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల(Wife and Husband) మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

    Guinness World Record: నిజంగా ఇది అద్భుతమే.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు.. ఎలా సాధ్యం అంటే..


    అప్పటి వరకు ఒకరిని ఒకరు చూసుకోరు.. కొన్ని రోజు క్రితం పరిచయం ఏర్పరచుకొని.. ఇష్టపడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటారు. ఇలా పెళ్లి పెళ్లిపీటల వరకు వచ్చిందంటే దాదాపు పెళ్లి జరిగినట్లే లెక్క. భార్యాభర్తల మధ్య బంధం.. అన్ని బంధాల కంటే కూడా చాలా గొప్పది. ఎందుకంటే.. కడదాకా తోడు ఉండేది వీరిద్దరే. అయితే అంతటి మహోన్నతమైన కార్యంలో ఓ వధువు చేసిన పనికి నవ్వాలో.. కోపం తెచ్చుకోవాలో అక్కడ ఉన్న వాళ్లకు అర్థం కాలేదు. ఇంతకు ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం..




    అక్కడ పెళ్లి వేడుక జరుగుతుంది. ఓ వైపు వాయిద్యాలు మోగుతున్నాయి. వధువు, వరుడు పెళ్లి పీటలపై కూర్చున్నారు. పండితుడు మంత్రాలను చెబుతున్నారు. ఇక ముఖ్య కార్యం వచ్చింది. తాళి కట్టు నాయనా.. అనగానే వరుడు లేచాడు. తాళిని చేతిలో పట్టుకొని వధువు మెడలో కట్టబోయాడు. దీంతో ఆ వధువు కోపంతో ఆ మంగళసూత్రాన్ని తీసి నేలకేసి కొడుతుంది. దీంతో అందరూ షాక్. అప్పటి వరకు మోగిన వాయిద్యాలు ఆగిపోయాయి.

    Weight loss: అధిక బరువు నుంచి బయటపడేందుకు డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..


    మంత్రాలు జపిస్తున్నా పంతులు ఒక్కసారిగా మూగబోయాడు. పెళ్లి పెద్దలు అంతా నోరెళ్లబెట్టరు. ఒక్క సెకన్ పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. అలా ఆమె తాళిని తీసుకొని కోపంతో కింద పడేసి.. అలా మండపం నుంచి దిగి నడుచుకుంటూ.. కొద్ది దూరం వెళ్లింది. ఎలా వెళ్లిందో అలానే మళ్లీ వెనకకు నవ్వుకుంటూ వచ్చింది. అప్పటివరకు ఆశ్చర్యంగా చూసిన పెళ్లి పెద్దలకు ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. ఎందుకు ఇలా చేశావ్ అంటూ అక్కడ ఉన్నవారు ఆమెను అడగ్గా.. నేను ఫ్రాంక్ చేశాను అంటూ చెప్పింది. దీంతో అక్కడ ఉన్న వారికి కొంచెం కోపం తెప్పించినా.. ఓర్చుకున్నారు.

    Success Story: ఆ మహిళ విజయ ప్రస్థానం.. ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.. ఆమె విజయగాధ మీకోసం..


    మరికొంతమంది పెళ్లిలో ఇలాంటి ఫ్రాంక్ లు ఏంటి రా బాబు అంటూ పళ్లు కొరుకున్నారు. అసలు ఆమెకు పెళ్లి, మంగళసూత్రం అంటే ఏమిటో తెలుసా.. అంటూ ప్రశ్నించుకున్నారు. తాళి కట్టిన తర్వాత ఇక పెళ్లిలో జరగాల్సిన కార్యక్రమాలు అంటే.. తలంబ్రాల సమయంలో పోటీపడటం, కానుకలు తీసే సయయంలో పోటీ వంటివి లైఫ్ లాంగ్ బెస్ట్ మూమెంట్స్‌ చేశారు. అయితే తాళిని నేలకోసి కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలు గా స్పందించారు. పెళ్లిలో ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Veera Babu
    First published: