పెళ్లయిన వెంటనే ఆట ఆడారు.. దానిలో వరుడికి తగలకూడని చోట దెబ్బతగిలింది.. గిలగిల కొట్టుకుంటూ.. వీడియో వైరల్..

దెబ్బతగలడంతో కిందపడిపోయిన వరుడు

New Married Couple : పెళ్లి అనేది మూడు ముళ్లతో ఒకటయ్యే బంధం. జీవించి ఉన్నంతకాలం ఒకరినొకరు తోడుగా.. కలకాలం ఉండాలంటూ.. పెళ్లిలో ప్రమాణం చేసి ముందుకు వెళ్తారు. పెళ్లిపీటల వద్ద వివాహం అయిన వెంటనే వివిధ రకాల ఆటలను వధూవరుల మధ్య చనువు పెంచటానికి వారితో ఆటలు ఆడించటం మామూలే. కానీ ఓ ఆట వరుడి ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  పెళ్లి (Marriage) అనేది మూడు ముళ్లతో ఒకటయ్యే బంధం. జీవించి ఉన్నంతకాలం ఒకరినొకరు తోడుగా.. కలకాలం ఉండాలంటూ.. పెళ్లిలో ప్రమాణం చేసి ముందుకు వెళ్తారు. పెళ్లిపీటల వద్ద వివాహం(Marriage) అయిన వెంటనే వివిధ రకాల ఆటలను వధూవరుల మధ్య చనువు పెంచటానికి వారితో ఆటలు(Games) ఆడించటం మామూలే. మనకు తెలిసిన ఆటల్లో బిందెలో ఉంగరం వేసి తీయడం.. పూల బంతితో ఆటలు లాంటివి ఉంటాయి. ఇలా మనదేశంలో ఉంటాయి. కానీ బయట దేశంలో ఇలా ఉండదు. వాళ్ల ఆటలు వెరైటీగా ఉంటాయి. అలా ఓ కొత్త జంట ఆడిన ఆట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  Photo Viral: ఆ బామ్మ చేసే పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకు ఆమె ఏం చేస్తుందో తెలుసా..


  అస్సలు ఆ జంట ఏ ఆట ఆడారో తెలుసా.. ఆ ఆటలో వరుడికి తగలకూడని చోట ఆ బాల్ తగిలింది. దీంతో అతడు కిందపడి గిలగిల కొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని కార్లియాన్‌ బే హోటల్‌ గార్డెన్‌లో కొంత కాలం క్రితం ఓ జంటకు పెళ్లి జరిగింది. తర్వాత పెళ్లి జరగిన తర్వాత వధూవరులు రౌండర్స్‌ బాల్‌ ఆడారు. మొదట వరుడు మ్యాట్ చెస్టర్ పీల్డ్ బాల్ వేశాడు. అటుగా ఆ బాల్ ను బ్యాట్ తో కొట్టడానికి సిద్ధంగా ఉంది వధువు. అతడు బాల్ వెయ్యగానే.. ఆమె ఆ బాల్ ను బ్యాట్ తో కొడుతుంది. దీంతో అది నేరుగా వెళ్లి వరుడు ప్రైవేట్ పార్ట్ లో తగులుతుంది. దీంతో ఆ వరుడు అక్కడిక్కడే కూలపడి పోతాడు.

  ఆంటీని హగ్ చేసుకోవాలి.. పర్మిషన్ ఇవ్వండి.. అంటూ ఆ పసిపాప ఏం చేసిందో చూడండి.. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా..


  కింద పడి గిలగిల కొట్టుకున్నాడు.
  ఈ సీన్‌ చూసి అక్కడి వాళ్లు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. అతడికి దెబ్బ తగిలిన విషయం ఆ వధువుకు తెలియక.. అక్కడే రౌండ్ లు వేసుకుంటూ ఉంది. అక్కడ చూస్తున్న వాళ్లు కూడా నవ్వుకుంటా.. ఆ వధువు పరుగెత్తుతుండగా.. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడే పెళ్లి వీడియో గ్రాఫర్ అలెగ్జాండర్ ఈ సీన్ ను తన కెమెరాలో బంధించాడు. దీనిని వధువు సోదరి హేలీ మెక్ డోనాల్డ్ తన టిక్ టాక్ అకౌంట్లో షేర్ చేసింది.

  Samantha Stylist: ప్రీతమ్ జుకల్కర్ ఒక గే.. అతడితో సమంత అలా చేస్తుందా.. నిజాన్ని బయటపెట్టిన..


  ఆ వీడియాలో దెబ్బతగిలిన వరుడిని అక్కడ ఉన్న వాళ్లు ఓదార్చారు. ఆ కొద్దిసేపటి తర్వాత వధువు కూడా వరుడి దగ్గరకు వచ్చి.. ఆర్‌ యూ ఓకే బేబీ అంటూ ఓదార్చింది. కానీ అప్పడికే అతడకి ఆ బాధ తగ్గినట్లు కనిపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పాపం సరదాకు పోతే.. అనుకోకుండా ఇలా జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: