పెళ్లి బట్టలతో నవ్వులపాలైన నవ వధువు.. అదేం డ్రెస్ అంటూ కామెంట్‌లు

కొత్త రకం ట్రెండ్‌ను ఫాలో అవుదామనుకున్న ఒక కొత్త పెళ్లికూతురికి అనుకోని అనుభవం ఎదురైంది. వినూత్న వెడ్డింగ్ గౌను ధరించినందుకు ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

news18-telugu
Updated: November 20, 2020, 10:48 PM IST
పెళ్లి బట్టలతో నవ్వులపాలైన నవ వధువు.. అదేం డ్రెస్ అంటూ కామెంట్‌లు
Photo Credit-Facebook
  • Share this:
కొత్త రకం ట్రెండ్‌ను ఫాలో అవుదామనుకున్న ఒక కొత్త పెళ్లికూతురికి అనుకోని అనుభవం ఎదురైంది. వినూత్న వెడ్డింగ్ గౌను ధరించినందుకు ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసౌకర్యంగా ఉన్న ఆ డ్రెస్‌తో కనీసం నడవడానికి, కూర్చోవడానికి కూడా ఆమె ఇబ్బంది పడింది. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించాలనుకున్న ఆ నవ వధువు నవ్వులపాలయింది. పేరును వెల్లడించని ఆ కొత్త పెళ్లికూతురి ఫోటోను ఎవరో I'm Wedding Shaming అనే ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో అది వైరల్‌ అయింది. ఫిగర్-హగ్గింగ్ స్ట్రాప్‌లెస్ దుస్తులను, ఆమె సెలక్షన్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఇదేం డ్రీమ్ వెడ్డింగ్ డ్రెస్’ అని ఒకరు, ‘కూర్చోలేని, నడవలేని, ఊపిరిపీల్చుకోలేని డ్రెస్ అంటే ఇదేనేమో’ అని మరొకరు ఆమె ఫోటోకు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

* ఫోటోలో పెళ్లికూతురు మెరిసే లైట్ల వెలుగులో నిల్చొని ఉంది. ఆమె ధరించిన ఫామ్ ఫిట్టింగ్ గౌను (form-fitting gown) తన నడుమును, హవర్ గ్లాస్ షేప్‌ను (hourglass shape) హైలైట్ చేసింది. కానీ అది ధరించి నడవడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల్లో పెళ్లి రోజు వధువు ధరించే ఫిట్-అండ్-ఫ్లేర్ దుస్తులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ ప్రత్యేకమైన డిజైన్ డ్రెస్ మాత్రం ఆమెకు ఏమాత్రం సౌకర్యంగా లేనట్టు అర్థమవుతోంది. ఆమె మోకాళ్ల వద్ద పట్టేసినట్లు డ్రెస్‌ను రూపొందించారు. దీంతో ఆమె చిన్న చిన్న అడుగులు మాత్రమే వేయగలదు. ఈ డ్రెస్ షేమింగ్ పోస్ట్‌కు 700కు పైగా లైక్‌లు వచ్చాయి. ఎంతోమంది వ్యగ్యంగా కామెంట్లు పెట్టారు.

* అందం గురించి కాదు...
మిమర్శకులు పెళ్లికూతురు అందంపై కాకుండా, ఆమె ధరించిన డ్రెస్‌పైనే కామెంట్లు పెడుతున్నారు. ఆమె చాలా అందంగా ఉందని కొంతమంది ప్రశంసించారు. కానీ అంత అందగత్తె ఇలాంటి వెడ్డింగ్ డ్రెస్‌ను ఎంచుకోవడం హాస్యాస్పదంగా ఉందని చెబుతున్నారు. 'ఆమె అసౌకర్యంగా కనిపిస్తుంది’ అని ఒకరు, ‘ఫోటోను చూడగానే అందవిహీనంగా ఉన్న ఆ డ్రెస్‌ మాత్రమే నాకు కనిపిస్తుంది’ అని ఇంకొకరు, ‘ఆమె ఒక కార్టూర్‌లా కనిపిస్తోంది’ అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇలా ఎంతోమంది డ్రెస్‌ షేమింగ్‌పై కామెంట్లు పెడుతున్నారు.

* వారికి నచ్చిందట
నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, కొంతమంది మాత్రం ఆమె డ్రెస్‌ బాగుందని మెచ్చుకుంటున్నారు. కొంచెం అసౌకర్యంగా ఉన్నప్పటికీ, పెళ్లి రోజున అందంగా కనిపించడానికి ఇలాంటి డ్రెస్ ధరించడం బాగుందని చెబుతున్నారు. 'ఇది చాలా అందంగా ఉంది' అని ఒక ఫేస్‌బుక్ యూజర్ కామెంట్ పెట్టారు. 'అందంగా కనిపిస్తే చాలు, కూర్చోవడం గురించి నేను పట్టించుకోను’ అని ఒకరు ఫోటోకు కామెంట్ పెట్టారు.
Published by: Sumanth Kanukula
First published: November 20, 2020, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading