Home /News /trending /

BRIDE IN A HEAVY LEHENGA AND GROOM WITH SHERWANI DO PUSH UPS ON WEDDING STAGE VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Viral Video : పెళ్లి దుస్తుల్లోనే వధూవరుల విన్యాసాలు... ఫిట్‌నెస్‌ ప్రాప్తిరస్తు అనాల్సిందే..

Viral Video : పెళ్లిలో అందరి ఫోకస్ వరుడు, వధువులపైనే ఉండటం కామన్. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి.

Viral Video : పెళ్లిలో అందరి ఫోకస్ వరుడు, వధువులపైనే ఉండటం కామన్. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి.

Viral Video : పెళ్లిలో అందరి ఫోకస్ వరుడు, వధువులపైనే ఉండటం కామన్. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి.

    ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం. పెళ్లంటే ఆకాశమంత పందిరి.. బంధువుల సందడి.. తప్పెట్లు, మేళాల హోరు.. అడుగు కదిలితే ఫొటోలు.. అదిరిపోయే అలంకరణలు.. ఏడడుగులు నడిచి.. మూడు ముళ్లు వేసే సందర్భాన్ని పదిలం చేసుకునే ఈ పండుగ.. ఆర్భాటం అంతా ఇంతా కాదు. అలాంటి పెళ్లిలో అందరి ఫోకస్ వరుడు, వధువులపైనే ఉండటం కామన్. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లి మండపంలో వధూవరులు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ ఇద్దరు ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్స్‌ తమ పెళ్లి రోజున పందిరిలోనే తమ ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుకోవడమే కాకుండా పుషప్స్‌ తీయడం.. (Bride and Groom Pushups) పెళ్లికిక వచ్చిన వారు కొత్త అనుభూతికి లోనయ్యారు.

    న్యూఢిల్లీకి చెందిన అక్షిత, అదిత్య మహజన్‌.. ఇద్దరూ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్స్‌గా సేవలందిస్తున్నారు. వీరు ఇటీవలనే పెళ్లి చేసుకున్నారు. అయితే, పెండ్లి పందిరిలో ఉన్నా తమకు ఇష్టమైన పుషప్స్‌ను మాత్రం మరిచిపోలేదు. అందరూ చూస్తుండగానే, పెండి పందిరిలోనే ఇద్దరూ పోటాపోటీగా పుషప్స్‌ తీసి ఔరా! అనిపించారు. వరుడు షేర్వాణిలో వ్యాయామం చేస్తుండగా.. వధువు భారీ లెహంగా, ఆభరణాలు ధరించి మరీ పుషప్స్‌ తీసింది. ఒకరిని మించి మరొకరు పుషప్స్‌ తీయడంతో పెళ్లికి వచ్చినవారంతా ‘ఫిట్‌నెస్‌ ప్రాప్తిరస్తు’ అంటూ దీవించి వెళ్లారు.






    ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ..ఈ వీడియోను వధువు అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘కలిసి ఎత్తే జంట చివరికి వివాహంతో ఏకమైంది’ అంటూ షేర్‌ చేయగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌.. ఎన్ని సెట్లు, రరేపెటిషన్స్ అని అడగ్గా.. ‘8 కిలోల లెహంగాతో 1సెట్ 10 రెప్స్ లోడ్ చేసిన పుషప్స్‌’ అని వధువు రిప్లై ఇచ్చింది. దీంతో 8 కిలోల బరువైన వెడ్డింగ్‌ లెహంగాను ధరించి ఈ విధంగా అందరూ చేయలేరని పెళ్లి కూతురిని నెటిజనులు అభినందిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Marriage, New Delhi, Viral Video, Viral Videos, Wedding

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు