పెళ్లికి వచ్చిన వాళ్లతో పెళ్లి కూతురు గొడవ.. వీడియో వైరల్

జో డల్లిమోర్ అనే వధువు తన పెళ్లిలో కొందరు అతిథులు గొడవ పడుతుండడాన్ని చూసి వారిని వారించింది. అయినప్పటికీ గొడవ సర్దుమణగక పోవడంతో వారిపై పిడుగుద్దులు కురిపించింది

news18-telugu
Updated: September 10, 2020, 6:11 PM IST
పెళ్లికి వచ్చిన వాళ్లతో పెళ్లి కూతురు గొడవ.. వీడియో వైరల్
గొడవ దృశ్యాలు
  • Share this:
కొందరి మధ్య జరిగిన ఘర్షణను ఆపడానికి ఏకంగా పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు రంగంలోకి దిగింది. ఈ ఘటన ఆస్ట్రేలియా సౌత్ వేల్స్లోని రగ్బీ క్లబ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జో డల్లిమోర్ అనే వధువు తన పెళ్లిలో కొందరు అతిథులు గొడవ పడుతుండడాన్ని చూసి వారిని వారించింది. అయినప్పటికీ గొడవ సర్దుమణగక పోవడంతో వారిపై పిడుగుద్దులు కురిపించింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. అక్కడున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. జో డల్లిమోర్ అనే వధువు వైట్ బాల్ గౌన్, తలపాగా దరించి పెళ్లి డ్రెస్లో ముస్తాబైంది.

పెళ్లి అనంతరం అందరూ పార్టీలో మునిగిపోయారు. ఆ సమయంలోనే అనుకోని సంఘటన జరిగింది. అయితే అక్కడే ఉన్న కొంత మంది అతిథులు గొడవ పడ్డారు. దీంతో వధువుకు చిర్రొత్తుకొచ్చింది. ఆ గొడవను సద్దుమణచడానికి తనే స్వయంగా రంగంలోకి దిగి వారితో గొడవ పడింది. అక్కడ జరిగిన సంఘటనపై వీడియో వైరల్ అవుతుండటంతో వధువు స్పందించింది. తాను ఏ పోరాటంలోనూ పాల్గొనలేదని, తన పెళ్లి విందు అనంతరం అక్కడే కొందరు అపరిచితులు గొడవ పడడాన్ని చూసి వారి గొడవను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. తన పెళ్లి రోజున ఇలా జరగడం తనకు ఇష్టం లేదని.. అందువల్లే తాను స్వయంగా వారితో గొడవపడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

Nothing like a good old punch up to end your wedding day. from r/trashyకొందరు వ్యక్తులు గుంపుగా చేరి గొడవ పడుతున్నప్పుడు నేను ఆ గొడవను విచ్ఛిన్నం చేయాలనుకున్నానని తెలిపింది. ఈ వీడియో వైరల్ కావడంతో, సంఘటన జరిగిన రగ్బీ క్లబ్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. గత రాత్రి క్లబ్లో జరిగిన సంఘటనపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలైనట్లు తెలిసిందని..,అయితే ఈ గొడవ వివాహ పార్టీ ముగిసిన తర్వాత క్లబ్ వెలుపల గొడవ జరిగిందని తెలిపాడు. ఇది ఒక ప్రైవేట్ ఫంక్షన్ అని... దీనిలో క్లబ్తో అనుబంధంగా ఉన్న ఎవరూ పాల్గొనలేదని వెల్లడించాడు. అందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నామమని క్లబ్లో జరిగిన ఘటనపై పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చామని క్లబ్ పేర్కొంది.
Published by: Kishore Akkaladevi
First published: September 10, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading