పెళ్లికొడుకు టాయిలెట్‌లో సెల్ఫీ తీసి పంపితే.. పెళ్లికూతురికి రూ.51వేల క్యాష్

ప్రతీకాత్మక చిత్రం

  • Share this:
    మధ్యప్రదేశ్ తీసుకొచ్చిన ఓ కొత్త పథకం ప్రకారం.. పెళ్లికొడుకు టాయిలెట్‌లో సెల్ఫీ తీసి పంపితే.. పెళ్లికూతురికి రూ.51వేల నగదు బహుమానం ఇస్తారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కన్య వివాహ పథకం’ ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులకు పెళ్లి సమయంలో రూ.51వేల నగదు ఇవ్వడం ఆ పథకం ఉద్దేశం. అయితే, అందుకోసం ఓ కండిషన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుంది. ఆ కండిషన్ ఏంటంటే.. పెళ్లికొడుకు ఇంట్లో టాయిలెట్ ఉండాలి. ఆ టాయిలెట్‌‌లో వరుడు సెల్ఫీ తీసి పంపాలి. పెళ్లికొడుకు ఇంట్లో టాయిలెట్ ఉందని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో అఫిడవిట్ దాఖలు చేయాలి. దీంతోపాటు వరుడి సెల్ఫీ విత్ టాయిలెట్ ఫొటోను కూడా జతచేయాలి. అవన్నీ పరిశీలించిన తర్వాత అధికారులు వధువుకు ప్రభుత్వం తరఫున రూ.51వేలు అందిస్తారు.

    First published: