హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Trending: వీడెక్కడి పెళ్లికొడుకండి బాబూ... వింత కారణంతో వధువు మెడలో తాళి కట్టేందుకు నిరాకరణ

Trending: వీడెక్కడి పెళ్లికొడుకండి బాబూ... వింత కారణంతో వధువు మెడలో తాళి కట్టేందుకు నిరాకరణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral News: ఒక వరుడు తన వధువు 12వ తరగతి పరీక్షలో తక్కువ మార్కులు సాధించిందనే కారణంతో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కొన్ని సందర్భాల్లో పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా సమయానికి కట్నం ఇవ్వలేదనే కారణాలే ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని వింత కారణాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఓ ఘటనలో పెళ్లి ఆగిపోవడానికి మేం చెప్పబోయే కారణం వింటే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఒక వరుడు తన వధువు 12వ తరగతి పరీక్షలో తక్కువ మార్కులు సాధించిందనే కారణంతో వివాహాన్ని రద్దు(Marriage Cancel) చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. వధువు కుటుంబం వారు 'గాడ్ భరై' ఆచారం చేసినప్పటికీ వారి కట్నం డిమాండ్లు తీర్చకపోవడంతో వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసిందని ఆరోపించింది.

వరుడి కుటుంబానికి చెందిన స్త్రీ పరస్పరం తమ కుటుంబంలోకి వధువును అంగీకరించే కార్యక్రమం గోధ్ భరై వేడుక.12వ తరగతి మార్కు షీట్‌లో అమ్మాయికి తక్కువ మార్కులు ఉన్నాయని వరుడి కుటుంబీకులు చెప్పి సంబంధాన్ని తెంచుకునేందుకు ప్రయత్నించారని వధువు తండ్రి ఆరోపించారు. దీంతో ఆందోళన చెందిన అతను వరుడు, అతని కుటుంబ సభ్యులపై కఠినమైన పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బాగన్వా గ్రామానికి చెందిన రాంశంకర్ కుమారుడు సోనుతో తన కూతురు సోని పెళ్లి నిశ్చయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని తరువాత, కుటుంబాలు డిసెంబర్ 4, 2022న తమ ‘గోద్ భరాయ్’ వేడుకను కూడా నిర్వహించాయి.

ఈ వేడుకలో రూ.60వేలకు పైగా ఖర్చు చేసి రూ.15వేలు విలువైన బంగారు ఉంగరాన్ని పెళ్లికొడుకు ఇచ్చాడని సమాచారం. అయితే వేడుక జరిగిన కొన్ని రోజుల తర్వాత, వరుడి కుటుంబం కట్నం కోసం డిమాండ్ చేసింది. వధువు తండ్రి ఎక్కువ కట్నం ఇవ్వలేనని చెప్పడంతో, అమ్మాయికి ఇంటర్మీడియట్‌లో తక్కువ మార్కులు ఉన్నాయని వరుడి కుటుంబం బంధాన్ని తెంచుకుంది. నివేదిక ప్రకారం, వధువు కుటుంబం బంధువును ఒప్పించడానికి కూడా ప్రయత్నించింది.

OMG: పళ్ళు తోముకోవడం, బట్టలు ఉతకడమే కాదు మూత్రంతో మరో ఆరు ప్రయోజనాలు ..షాకింగ్ న్యూస్

Slowest Train in India: ఈ రైలు బండి ఎడ్ల బండితో సమానం.. మన దేశంలోనే.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందంటే..

కానీ వరుడు వారి డిమాండ్ పట్ల మొండిగా ఉన్నాడు. వధువు తండ్రి పోలీసుల నుండి సహాయం కోరవలసి వచ్చింది. కాగా ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోతే.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పిఎన్ బాజ్‌పాయ్ తెలిపారు. ఏదేమైనా.. పెళ్లి నిరాకరించేందుకు అబ్బాయి తరపున వాళ్లు పైకి చెబుతున్న కారణం విన్న వాళ్లంతా.. ఇలాంటి సాకుతో కూడా పెళ్లిని ఆపేస్తారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

First published:

Tags: Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు