పెళ్లికూతురితో డాన్స్ చేసిన కుక్క... వైరల్ అయిన వీడియో

Viral Video : మనం చెప్పినట్లు వినే కుక్కలకు ట్రైనింగ్ ఇస్తే, అద్భుతాలు చేసి చూపిస్తాయి. ఈ వీడియోలో పెళ్లికూతురితో డాన్స్ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆ పెట్ డాగ్.

Krishna Kumar N | news18-telugu
Updated: June 29, 2019, 1:39 PM IST
పెళ్లికూతురితో డాన్స్ చేసిన కుక్క... వైరల్ అయిన వీడియో
Viral Video : మనం చెప్పినట్లు వినే కుక్కలకు ట్రైనింగ్ ఇస్తే, అద్భుతాలు చేసి చూపిస్తాయి. ఈ వీడియోలో పెళ్లికూతురితో డాన్స్ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆ పెట్ డాగ్.
  • Share this:
ఒక్క వీడియో... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్ అవుతోంది. సెలబ్రిటీ డాగ్ ట్రైనర్ సారా కార్సన్ డివైన్... తన వెడ్డింగ్ రోజున తన కుక్కతో డ్రాన్స్ ఫ్లోర్‌పై అదరగొట్టింది. ఆమెకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో కుక్క కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వీడియోను ఆమె మేనేజర్... ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వెంటనే అది వైరల్ అయ్యింది. దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత అదే వీడియో ఇన్‌స్టాగ్రాంలో కూడా దుమ్మురేపుతోంది. ఒకప్పుడు అమెరికా గాట్ టాలెంట్ (America's Got Talent)లో చేసిన సారా... తన పెట్ డాగ్... హీరోతో... ఎయిటీస్ హిట్ సాంగ్ ఫుట్‌లూజ్‌కి డాన్స్ వేసింది. శనివారం వెడ్డింగ్ తర్వాత... లాస్ వెగాస్‌లో ఈ వీడియోని షూట్ చేశారు.
 View this post on Instagram
 

Once in a lifetime and Hero was able to celebrate with me! Love him so much 😍


A post shared by The Super Collies (@thesupercollies) on

ఆడియన్స్ ముందు ఏమాత్రం బెరుకు లేకుండా పూచ్... చక్కగా పెర్ఫార్మ్ చేసింది. సారా చెప్పినట్లు వింటూ... ఆమె చేస్తున్న సైగల్ని తెలుసుకుంటూ, అప్పటికప్పుడు కొత్త కొత్త స్టెప్పులు వేసిందీ పెట్ డాగ్. ఏడేళ్లుగా ఎన్నో నేర్చుకున్న ఆ పప్పీ... జంపింగ్, ప్రాన్సింగ్, క్లైంబింగ్, డాన్సింగ్ అన్నింటినీ చక్కగా చేసింది. ఆ వీడియోని మీరూ చూడండి. 
View this post on Instagram
 

Today was a big day! - - So happy to have Hero by my side through my life’s journey. We had a Super Devine night 💍👰


A post shared by The Super Collies (@thesupercollies) on

ప్రస్తుతం ఈ వీడియోకి వేల కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో ఎంతో ఆనందం కలిగించిందని కొందరు అంటుంటే... ఆ కుక్క పెర్ఫార్మ్ తమను ఆశ్చర్యంలో పడేసిందని కొందరు అంటున్నారు. తాను ఐదు కుక్కల్ని పెంచుతున్నానన్న సారా... హీరో తనకు ప్రత్యేకమైనది అని తెలిపింది.
Published by: Krishna Kumar N
First published: June 29, 2019, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading