Home /News /trending /

BRIDE DANCE ON RRR MOVIE NATU NATU SONG ON HER WEDDING CEREMONY VIDEO GOES VIRAL PAH

Wedding: చీరకట్టులో వధువు ఉరా మాస్ స్టెప్పులు.. చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదుగా.. వైరల్ వీడియో..

పెళ్లిలో వధువు మాస్ స్టెప్పులు

పెళ్లిలో వధువు మాస్ స్టెప్పులు

Viral video: పెళ్లి వేడుకలో వధువు డ్యాన్స్ తో రచ్చ చేస్తుంది. తన స్నేహితులతో కలిసి నాటు నాటు పాటకు హట్ గా స్టెప్పులు వేస్తు అదరగొడుతుంది.

పెళ్లిలో (Wedding) నేటి యువత ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు పెళ్లిలో వధువు సిగ్గుతో తలవంచుకుని వేదికమీద కూర్చుని ఉండేవారు. కానీ ఇప్పుడు డ్యాన్స్ చేసుకుంటూనే పెళ్లి మండపానికి ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు, బరాత్ లో డ్యాన్స్ లు చేయడానికి అమ్మాయిలను లాక్కెళ్లే వారు. కానీ ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా అమ్మాయిలు ఒక రేంజ్ లో మాస్ స్టెప్పులు వేస్తు అందరిని అదరగొడుతున్నారు.

ఇప్పటి వరకు అమ్మాయిలకు డ్యాన్స్ (Dancing)  చేయడానికి సిగ్గుపడేవారు. కానీ ప్రస్తుతం వారు అదే డ్యాన్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు మాస్ స్టెప్పులు, నాటు డ్యాన్సుల వీడియోలు ఒక రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బుల్లెటు బండి పాట ఏ రేంజ్ లో దూసుకుపోయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎక్కడ పెళ్లి వేడుకలో చూసిన బుల్లెట్ బండి పాటనే ట్రెండ్ గా మారింది. ఇక వధువులు కూడా ఏమాత్రం తగ్గేదెలే.. అన్నట్లుగా బుల్లెట్ బండితో తమ పెళ్లి మండపానికి చేరుకుంటున్నారు.






కొందరు తమ పెళ్లి ఎప్పటికి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకొవడానికి రకరకాల ప్లాన్ లు వేస్తున్నారు. పెళ్లిలో జరిగే ప్రతి వేడుక యూనిక్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు.. పెళ్లిలో రకరకాల డ్యాన్స్ ల వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో వధువు చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఈ పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అయితే, దీనిలో స్పెషల్ ఏంటంటే.. వధువు తన స్నేహితులతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు.. పాటకు దుమ్మురేపే స్టెప్పులతో అదరగొడుతుంది. ఏమాత్రం తగ్గుకుండా మాస్ స్టెప్పులతో అతిథులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆమె డీజే బీట్ కు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులు వేస్తు అక్కడున్న వారిని షాకింగ్ కు గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు