సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఓవర్‌నైట్‌లో స్టార్‌లుగా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నవవధువు కూడా ఈ జాబితాలో చేరింది. ఊహించని విధంగా ఆమె డ్యాన్స్ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎం చేసిందంటే.. తన పెళ్లి వేడుకల్లో.. భర్తతో జీవితాంతం కలిసి ఉంటానని తెలుపుతూ ఆనందంలో డ్యాన్స్ చేసింది. ఇందుకు సింగర్ మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’పాట తోడైంది. ఇంకేముంది ఆమె డ్యాన్స్ సూపర్ హిట్. ఆమె డ్యాన్స్‌లో గ్రేస్, పాటలోని పదాలకు అనుగుణంగా వేసిన స్టెప్స్ వేసింది. అయితే వరుడు మాత్రం తన భార్య డ్యాన్స్ చేస్తుంటే సంబరపడుతూ అలా ఉండిపోయాడు. అక్కడున్నవారంతా ఫుల్ జోష్‌తో వధువును ఎంకరేజ్ చేశారు. వధువు డ్యాన్స్ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి పి నరహరి కూడా ఈ వీడియోను తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘పెళ్లి కూతురు.. పెళ్లికొడుకు కోసమే నిజంగా డ్యాన్స్ చేసింది. ఆమె చాలా సంతోషంగా అతన్ని జీవితంలోకి ఆహ్వానిస్తోంది. నిజమైన ప్రేమ. అతడి బుల్లెట్టు బండిపై సవారీ చేయాలనుకుంటోంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. మోహన భోగరాజు బాగా పాడారు’అని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. చాలా మంది ఆ వధూవరుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
This bride has truly danced for the groom. She is so happy welcoming him into her life. #truelove Wants to ride on his #Bulletbandi Lovely lyrics and song by @MohanaBhogaraju pic.twitter.com/lV4kdGPplm
— P Narahari IAS (@pnarahari) August 17, 2021
ఆ వధువు వివరాలంటే చూద్దాం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్‌కల్ గ్రామానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయకు రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం ఈ నెల 14న వివాహం జరిగింది. సాయి శ్రీయ విప్రోల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అశోక్ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీయ తన పెళ్లి బారాత్‌లో ఆమె ఆనందంలో.. భర్తతో జీవితాంతం కలిసి ఉంటానని తెలిపేలా బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఆ లిరిక్స్, పాట అంతే అద్భుతంగా ఉండటంతో.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mancherial, Viral Video