BRIDE CALLS OFF WEDDING SAYS SHE WONT MARRY ILLITERATE GROOM PVN
Viral Video : ఇంగ్లీష్ మాట్లాడే వాడినే పెళ్లి చేసుకుంటా..పీటలపై వరుడికి షాక్ ఇచ్చిన వధువు
వరుడు నిరక్ష్యరాస్యుడని పెళ్లి ఆపేసిన వధువు
Bride Says Wont Marry Illiterate Groom: కొంతకాలంగా పెళ్లిళ్లలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. అసలు పెళ్లి మండపానికి వరుడు,వధువు చేరుకునేలోపే చాలా జరిగిపోతున్నాయి. నూరేళ్లు కలిసి ఉండాలని కన్న కలలన్నీ క్షణాల్లో కలలుగానే మిగిలిపోతున్నాయి.
Bride Says Wont Marry Illiterate Groom: కొంతకాలంగా పెళ్లిళ్లలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. అసలు పెళ్లి మండపానికి వరుడు,వధువు చేరుకునేలోపే చాలా జరిగిపోతున్నాయి. నూరేళ్లు కలిసి ఉండాలని కన్న కలలన్నీ క్షణాల్లో కలలుగానే మిగిలిపోతున్నాయి. కొన్ని తెలియని కారణాల వల్ల ఒక వధువు తన వివాహాన్ని వేదికపై నిలిపివేసిన సంఘటనలు మనం చాలానే చూశాం. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. తీరా పెళ్లి పీటల దాకా వచ్చిన తర్వాత వధువు.. వరుడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. 'bridal_lehenga_designn’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో దీనికి సంబంధించి ఈ వీడియోను అప్ లోడ్ చేయగా..ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్చలైక్ లు వస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో..వధూవరులు పెళ్లి దుస్తులు ధరించి, చేతుల్లో జయమాలలతో వేదికపై నిలబడి ఉన్నారు. ఈ సమయంలో వరుడు తన చేతులో వధువు మెడలో పెట్టిన తర్వాత, ఆమె తన మెడలోని దండను చేతితో పట్టుకుని వేదిక ఎదురుగా ఉన్నవారితో.. వరుడు నిరక్షరాస్యుడు,తాను బి. ఎడ్ చదువుతున్నందున అతడిని పెళ్లి చేసుకోనని వేదికపై నుండి చెప్పింది. వరుడిని ఎందుకు వివాహం చేసుకోవు అని వేదిక కింద ఉన్న ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకి వధువు సమాధదానమిస్తూ.. "నేను చదువుకున్న వ్యక్తిని. నేను B. Ed చదువుతున్నాను. అతను పూర్తిగా నిరక్షరాస్యుడు. నేను అతనితో సంతోషంగా ఉండగలనా? మీరు నాకు చెప్పండి? నేను అతనిని వివాహం చేసుకోలేను ”అని చెప్పింది.
అయితే అలాంటప్పుడు ఇక్కడిదాకా రావడం దేనికి,పెళ్లికి ముందే ఈ విషయం మీ ఇంట్లో వాళ్లకు చెప్పొచ్చు కదా అని కళ్యాణమండపంలోని ఓ వ్యక్త అడిగిన ప్రశ్నకు...డబ్బు కోసం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోమని తన తండ్రి బలవంతం చేస్తున్నాడని ఆమె సమాధానం ఇచ్చింది. తనకు పెళ్లి చేసోవడానికి విద్యావంతుడు, ఇంగ్లీష్ లో తనతో సంభాషించగల వ్యక్తి కావాలని ఆ వధువు వేదికపై నుంచి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా వేదికపై ఉన్న వరుడు అయితే అలా చూస్తూ ఉండిపోయాడు.
మరోవైపు,పెళ్లి మండపానికి వరుడు ఆలస్యంగా వచ్చాడన్నా కారణంగా అతడితో వివాహానికి నిరాకరించిన వధువు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రంలోని బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం 4 గంటలకు పెళ్లి ముహూర్తం. పెళ్లి మండపానికి అతిథులు చేరుకున్నారు. కానీ వరుడు మాత్రం ఆ సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేదు. పెళ్లి కుమారుడి కోసం పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, బంధువులు వేచి చూస్తున్నారు. అయితే వరుడు మాత్రం ఫుల్ గా మద్యం సేవించి బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్సులు వేశాడు. మధ్యాహ్నానికే మల్కాపూర్ పాంగ్రా గ్రామానికి చేరుకున్న వరుడు బారాత్ ముగించుకొని పెళ్లి మండపానికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలయింది. ముహూర్తం దాటిన తర్వాత వచ్చిన వరుడి తీరుపై వధువు తండ్రి ఆగ్రహం చెందాడు. ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందంటూ వరుడి తరఫు వారిని వధువు తరఫు వారు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. అయితే కొద్దిసేపటికే ఈ గొడవ ఓ కొలిక్కి వచ్చింది. కానీ, ఆ తర్వాత వధువు తాను ఈ పెళ్లి చేసుకోలేనంటూ తన తండ్రికి తేల్చిచెప్పింది. పెళ్లికి ముందే ఇలా ఉంటే..పెళ్లి అయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటదో అని భయపడిన వధువు..అతడితో పెళ్లి వద్దంటే వద్దు అని తండ్రికి తెగేసి చెప్పింది. దీంతో కూతురు నిర్ణయాన్ని తండ్రి గౌరవించాడు. వరుడు కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. దీంతో వరుడు పెళ్లి చేసుకోకుండానే వెళ్లిపోయాడు. అయితే ఆ మరుసటి రోజే వధువు తండ్రి..పెళ్లికి వచ్చిన ఒక బంధువుతో మాట్లాడి అతడి కుమారుడితో తన కుమార్తెకు పెళ్లి చేశాడు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.