హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

తాళి కట్టు శుభవేళ.. వరుడికి షాక్.. పెళ్లపీటలపై వధువుకి సింధూరం పెట్టిన ప్రియుడు

తాళి కట్టు శుభవేళ.. వరుడికి షాక్.. పెళ్లపీటలపై వధువుకి సింధూరం పెట్టిన ప్రియుడు

తాళి కట్టు శుభవేళ.. ప్రియుడి ఎంట్రీ.. వరుడి ముందే వధువు నుదుట సింధూరం.. ..

తాళి కట్టు శుభవేళ.. ప్రియుడి ఎంట్రీ.. వరుడి ముందే వధువు నుదుట సింధూరం.. ..

viral Video: అంతా సవ్యంగా సాగుతుందనుకున్న క్రమంలో వధువు ప్రియుడు ముఖేష్ ఎంట్రీ ఇచ్చాడు. జయమాల సమయంలో.. వేదికపైకి ఎక్కి.. వధువును కౌగిలించుకున్నాడు. అనంతరం మెడలో పూలమాల వేసి.. నదుట సింధూరం పెట్టాడు

పెళ్లి వేడుకతో ఆ ఇల్లు కళకళలాడుతోంది. బంధువుల సందడితో సరికొత్త శోభను సంతరించుకుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివాహ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉండగా.. అంతలోనే ఊహించని సంఘటన జరిగింది. జయమాల సమంలో వధువు ప్రేమికుడు ఎంట్రీ ఇచ్చాడు. వేదిక ఎక్కడి వధువు మెడలో పూల మాల వేసి.. నుదుట సింధూరం పెట్టాడు. అ దృశ్యాన్ని చూసిన అతిథులు.. ఖంగుతిన్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత.. అసలు మ్యాటర్ తెలిసి అవాక్కయ్యారు. యువకుడిని పట్టుకొని చితకబాదారు. బీహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

నలంద జిల్లా ముబారక్‌పూర్ గ్రామానికి చెందిన ముఖేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామన్నారు. జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. కానీ వీరి ప్రేమ విషయం బాలిక కుటుంబంలో తెలియడంతో.. వారు మందలించారు. యువకుడికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఆ తర్వాత తమ కూతురికి వేరొక అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. మంగళవారం రాత్రి పెళ్లికూతురు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న క్రమంలో వధువు ప్రియుడు ముఖేష్ ఎంట్రీ ఇచ్చాడు. జయమాల సమయంలో.. వేదికపైకి ఎక్కి.. వధువును కౌగిలించుకున్నాడు. అనంతరం మెడలో పూలమాల వేసి.. నదుట సింధూరం పెట్టాడు. ఊహించని ఆ ఘటనతో పెళ్లింటి వారు షాక్ తిన్నారు. ఆ తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో పీటల మీదే ఆగిపోయింది. ఈ క్రమంలోనే అక్కడున్న బంధువులు ముఖేష్‌ను పట్టుకొని చితకబాదారు.

' isDesktop="true" id="1361104" youtubeid="H8-SNSPzSXc" category="national">

వధువు బంధువుల దాడి చేయడంతో ముఖేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తలకు పెద్ద గాయమైంది. ముఖంపై కూడా దెబ్బలు తగిలాయి. వెంటనే గ్రామస్థులు అతన్ని కాపాడారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పనించారు. ఈ ఘటనపై వధువు తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురి పెళ్లి చెడగొట్టేందుకు వచ్చాడని వాపోయారు. ఈ విషయమై పోలీసులు ముఖేష్‌ని విచారించగా.. అసలు విషయం తెలిసింది. వధువు, తాను ఏడాది నుంచి ప్రేమించకుంటున్నామని... తమ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో.. వేరొక యువకుడితో పెళ్లి జరిపిస్తున్నారని చెప్పాడు. వధువు స్వయంగా తన మొబైల్‌కు ఫోన్‌ చేసి కన్నీళ్లు పెట్టుకుందని.. పెళ్లి సమయంలో వచ్చి సింధూరం పెట్టాలని కోరినట్లు తెలిపాడు. అందుకే తాను అలా చేశానని పోలీసులకు వివరించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖేష్‌తో పాటు వధువు తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published:

Tags: Bihar, National News, Trending, Viral Video

ఉత్తమ కథలు