Home /News /trending /

Bride Beats Groom: కారులో విశ్వరూపం చూపించిన వధువు.. వరుడిపై దాడి.. నవ్వులు పూయిస్తున్న వీడియో

Bride Beats Groom: కారులో విశ్వరూపం చూపించిన వధువు.. వరుడిపై దాడి.. నవ్వులు పూయిస్తున్న వీడియో

(Image-Instagram)

(Image-Instagram)

ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే.

    ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం. తాజాగా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కారులో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. వారిద్దరు కారులో ఉన్న సమయంలో వధువు ఒక్కసారిగా వరుడిపై దాడి(Attack on Grom) చేస్తుంది. వరుడి తీవ్ర స్థాయిలో విరుచుకుపడి.. చెంపలపై వాయించింది. తొలుత వరుడి మెడపై చేయి వేసి.. మరో చేతిని అతని మూతిపై పెట్టింది. ఆ తర్వాత అతని తలను అటూ ఇటూ ఉపసాగింది. ఆ తర్వాత అతనిని కొట్టింది. అయితే వరుడు(Groom) మాత్రం ఎదురుతిరగకుండా అలానే ఉండిపోయాడు.

    ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో _.chutiyapa._ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్తులో వరుడి పరిస్థితి ఏమిటని సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు మాత్రం అతన్ని చూస్తే జాలి వేస్తుందని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటిరకు 3.2 లక్షల వ్యూస్ వచ్చాయి.

    Dalit Bandhu: దళిత బంధుపై సీఎం కేసీఆర్ స‌న్నాహ‌క స‌మావేశం.. డేట్ ఫిక్స్.. సమావేశంలో పాల్గొనేది ఎవరంటే..?

    అయితే ఇది నిజంగా జరిగిందా..?, లేదా సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేయడం కోసం చేసిందా..? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. వరుడితో వధువు ఎందుకలా చేసిందనే దాని గురించి పలువురు నెటిజన్లు తమకు తోచిన కామెంట్స్ పడుతున్నారు. ఆమె అడిగిన పని చేయకపోవడంతో ఇలా చేసిందని కొందరు.. లేకపోతే ఆమెకు కోపం తెప్పించేలా ప్రవర్తించాడని మరికొందరు స్పందిస్తున్నారు.






    అయితే ఇటీవలి కాలంలో వైరల్‌గా మారుతున్న వీడియోల్లో (Viral Video).. కొన్నింటికి సంబంధించిన వాస్తవాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. చాలా వరకు వీడియోలు.. నిజంగా జరిగిందా, లేదా ఫన్ కోసం క్రియేట్ చేశారా అనే దానిపై స్పష్టత లేకుండా పోతుంది. కొన్ని ఆసక్తికరమైన వీడియోలలో నిజాల గురించి నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న లాభం లేకుండా పోతుంది. దీంతో సోషల్ మీడియాలో వచ్చే ఏ వీడియోను నమ్మాలో, ఏ వీడియోను నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Funny video, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు