మాజీ లవర్‌ను కౌగిలించుకుంటానని కాబోయే భర్తనే అనుమతి అడిగిన వధువు.. ఆ తర్వాత ఏమైందంటే...

వరుడు, వధువు, వధువు మాజీ ప్రియుడు

ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే ప్రియుడు పెళ్లికి రావటం, ఆ ప్రియుడిని పెళ్లి మండపంలోకి రాకుండా అడ్డుకోవడం, ఒకవేళ లోపలికి వచ్చినా తను ప్రేమించిన అమ్మాయి ఆ పెళ్లిని కాదనుకుని తన కోసం పీటల మీద నుంచి లేచి వస్తుందనే నమ్మకంతో ఆమెనే చూస్తూ...

  • Share this:
    ఇండోనేషియా: ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే ప్రియుడు పెళ్లికి రావటం, ఆ ప్రియుడిని పెళ్లి మండపంలోకి రాకుండా అడ్డుకోవడం, ఒకవేళ లోపలికి వచ్చినా తను ప్రేమించిన అమ్మాయి ఆ పెళ్లిని కాదనుకుని తన కోసం పీటల మీద నుంచి లేచి వస్తుందనే నమ్మకంతో ఆమెనే చూస్తూ ప్రియుడు ముందు వరుసలో కూర్చోవడం.. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిన సీన్లే. కానీ.. వాస్తవం ఇందుకు ఏమాత్రం దగ్గరగా ఉండదు. కానీ.. ఇలాంటి ఓ ఘటనే ఇండోనేషియాలో జరిగింది. తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుందన్న సంగతి తెలిసి, ఆమె వివాహానికి ప్రియుడు హాజరయ్యాడు. అంతేకాదు, తన ప్రియుడిని కౌగిలించుకోవడానికి ఆ వధువు ఏకంగా వరుడినే అనుమతి కోరింది.

    ఈ సందర్భంలో.. వేరెవరున్నా తనకు కాబోయే భార్య, తన ఎదుటే వేరొకరిని కౌగిలించుకుంటానంటే ఒప్పుకోరు సరికదా ఆమె అభ్యర్థన విని కోపంతో ఊగిపోతారు. కానీ.. ఈ పెళ్లి కొడుకు మిస్టర్ కూల్‌లా స్పందించాడు. తనకు కాబోయే భార్య అడిగిన కోరికను మన్నించాడు. దీంతో.. పెళ్లి మండపం పైనే వధువు తన మాజీ ప్రియుడిని కౌగిలించుకుంది. ఆ మాజీ ప్రియుడు కూడా భావోద్వేగానికి లోనైనప్పటికీ, ఆ బాధను దిగమింగుకుని వరుడికి శుభాకాంక్షలు తెలిపాడు. వరుడినీ గుండెలకు హత్తుకున్నాడు. ఇంతటితో కథ సుఖాంతం అయింది. అంతేకాదు, ఆ వీడియోను సదరు వధువు టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ‘మీ భర్త చాలా మంచి వ్యక్తి’ అంటూ ఓ నెటిజన్ స్పందించగా, ‘పోనీలే.. కనీసం అనుమతైనా కోరింది’ అంటూ వధువు అభ్యర్థనకు నిట్టూరుస్తూ ఒకరు కామెంట్ చేశారు. మరొకరు మాత్రం ‘ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు, వేరొక వ్యక్తిని కౌగిలించుకున్న ఆమెకు భర్తంటే కనీస గౌరవం లేదు’ అని స్పందించారు. ఏదేమైనా సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా టిక్‌టాక్‌లో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

    మరొక ఘటనలో.. తన మాజీ ప్రియుడికి పెళ్లి జరుగుతుందన్న సంగతి తెలుసుకున్న ఓ యువతి వధువులా అలంకరించుకుని, పెళ్లి మండపానికి వెళ్లి తన వద్దకు రావాలంటూ మాజీ ప్రియుడిని కోరింది. మాజీ ప్రియుడికి బహిరంగంగా, బిగ్గరగా అరుస్తూ ఆ యువతి క్షమాపణ చెప్పిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాన్నంతా కళ్లారా చూసిన వధువు షాక్‌తో మండపం దిగి వెళ్లిపోయింది. వరుడు ఆమెకు జరిగిందేంటో వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
    Published by:Sambasiva Reddy
    First published: