Video: వధూవరులకు కర్చీఫ్ ఛాలెంజ్... ఎవరు గెలిచారో తెలుసా?

వధూవరులకు కర్చీఫ్ ఛాలెంజ్ (image credit - instagram)

Viral Video: జనరల్‌గా పెళ్లి వేడుకల్లో వధువు కాస్త సైలెంట్‌గా ఉంటే... వరుడు హుషారుగా ఉంటాడు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. వధువు చెలరేగిపోయింది. మరి ఛాలెంజ్ గెలిచిందెవరు?

  • Share this:
    Viral Video: ఇదివరకు పెళ్లి అంటే... పంతులు గారు చెప్పింది మాత్రమే చేసేవాళ్లు. ఇప్పుడు రోజులు మారాయి. ఆచారాల ప్రకారం పెళ్లి అయిపోగానే... వధూవరుల ఫ్రెండ్స్ చుట్టూ చేసి... కొత్త కొత్త ఛాలెంజ్‌లు, టాస్కులూ ఇస్తున్నారు. దాంతో వధూవరులకు ఇష్టం ఉన్నా, లేకపోయినా... వాటిలో పాల్గొనక తప్పట్లేదు. జనరల్‌గా పెళ్లి తర్వాత దాంపత్య జీవితం ఎప్పుడూ సాఫీగానే సాగిపోదు... అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి... మళ్లీ వాళ్లే సర్దుకుపోతుంటారు. దీన్ని లెక్కలోకి తీసుకొని... ముంబైలో జరిగిన ఆ పెళ్లిలో... వధూవరులకు (Bride Groom Video) చిన్న ఛాలెంజ్ పెట్టారు. నేలపై ఓ కర్చీఫ్ ఉంచి... ఇద్దర్లో ఎవరు దాన్ని దక్కించుకుంటారో వారే విన్నర్స్ అన్నారు.

    ఛాలెంజ్ స్వీకరించిన వధూవరులు... ఒకేసారి కర్చీఫ్ పట్టుకున్నారు (Wedding Video). వధువేమో... కర్చీఫ్ లాక్కునేందుకు ప్రయత్నించగా... వరుడు ఒక్కసారిగా తన వైపు లాక్కునేసరికి... వధువు పరుగులు పెట్టాల్సి వచ్చింది. రెండువైపులా ఫ్రెండ్స్ చేరి... వదలొద్దు... వదలొద్దు అని అటు వధువుకూ, ఇటు వరుడికీ చెబుతూ ఎంకరేజ్ చేశారు (Wedding Games).

    ఈ పోటీ ఎంతకూ ఆగకపోగా... వధూవరుల చుట్టూ అంతా చేరి రెచ్చగొడుతుంటే... ఈ ఆటకు బ్రేక్ చెప్పేందుకు వరుడు ఆమెను ఎత్తుకొని వెళ్లి ఫ్యాన్ దగ్గర దించాడు. దాంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.




    ఇది కూడా చదవండి: Potato Milk: ఆలూ పాలు.. టేస్ట్ అదుర్స్. త్వరలో మార్కెట్లలో లభ్యం

    ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో విటి వెడ్డింగ్ అకౌంట్ పోస్ట్ చేసింది. ఈ సంస్థ వెడ్డింగ్స్ జరిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోని చూసిన చాలా మంది ఎంజాయ్ చేశారు. ఫన్నీ కామెంట్స్ పెట్టారు.
    Published by:Krishna Kumar N
    First published: