Home /News /trending /

BRICK KILN OPERATOR SUSHIL SHUKLA FINDS DIAMOND WORTH OVER RS 1 CRORE IN MADHYA PRADESH PANNA MINE MKS

Panna: ఇటుక బట్టీ యజమాని.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!.. కానీ అసలు ట్విస్టుకు షాకవ్వాల్సిందే!

సుశీల్ శుక్లా

సుశీల్ శుక్లా

ఇటుక బట్టీలు నడిపే ఓ వ్యక్తి ఒక్కరోజులోనే దశ తిరిగి కోటీశ్వరుడైన వైనం సంచలనంగా మారింది. అయితే వాళ్లు తమకు దక్కిన సంపదను అందరికీ పంచాల్సిన పరిస్థితి. వాళ్లకు వజ్రం దొరకిన చోటుకు కూడా చరిత్రలో గొప్ప స్థానం ఉంది.

కొండత కష్టపడినా.. ఆవగింజంతైనా అదృష్టం ఉండాలంటారు. ఆ కుటుంబం నిజంగానే 20 ఏళ్లపాటు కొండలు తొవ్తేస్తూ తెగ కష్టపడింది. ఇంత కాలానికి గానీ కచ్చా బాదం(వేరుశెనగ) గింజంత అదృష్టం దొరికింది. ఆ అదృష్టం మరేమిటోకాదు.. వజ్రం. మధ్యప్రదేశ్ లో ఇటుక బట్టీలు నడిపే ఓ కుటుంబం ఒక్కరోజులోనే దశ తిరిగి కోటీశ్వరులైన వైనం సంచలనంగా మారింది. అయితే వాళ్లు తమకు దక్కిన సంపదను అందరికీ పంచాల్సిన పరిస్థితి. వాళ్లకు వజ్రం దొరకిన చోటుకు కూడా చరిత్రలో గొప్ప స్థానం ఉంది. మరి ఆ ఆసక్తికర కథనం వివరాల్లోకి వెళితే...

పశ్చిమ-మధ్య భారతంలో విస్తరించిన వింధ్యా పర్వతాలకు ఈశాన్య భాగంలో దాదాపు 250 కిలోమీటర్ల మేర కొన్ని కొండలు ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిని పన్నా గ్రూప్ కొడలని పిలుస్తారు. ఆ ప్రాంతాన్ని బట్టే జిల్లాకు కూడా పన్నా అనే పేరొచ్చింది. మధ్యప్రదేశ్ పరిధిలోని పన్నా పట్టణానికి మరో పేరే ‘సిటీ ఆఫ్ డైమండ్స్’. అవును వింధ్యా పర్వతాల్లో ప్రత్యేకంగా నిలిచే పన్నా శ్రేణి విస్తరించిన పన్నా జిల్లాలో వజ్రాలు విరివిగా దొరికేవి. ఈ పట్టణం భోపాల్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.

Ramya Raghupathi: నటుడు నరేశ్ మాజీ భార్య రమ్యపై కేసులు నమోదు.. మరో శిల్పా చౌదరి?

పన్నాలో వజ్రాల గనుల్ని శతాబ్దాల కిందటి నుంచే నిర్వహిస్తున్నారు. ఇక్కడ లభ్యమైన ఎంతో విలువైన వజ్రాలను బ్రిటీష్ వాళ్లు సైతం ఎత్తుకెళ్లారు. స్వాతంత్రం తర్వాత నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) వజ్రాల గనుల్ని నిర్వహించింది. పన్నా ప్రాంతంలో కొన్ని చోట్ల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కూడా లీజుకు ఇచ్చే పద్దతి దశాబ్దాలుగా కొనసాగుతోంది. మైనింగ్ అక్రమ వ్యవహారాలు సరేసరి. రానురాను వజ్రాల లభ్యత బాగా తగ్గిపోయింది. అలా ప్రస్తుత విషయానికి వస్తే..

Ukraine Crisis: తక్షణమే ఉక్రెయిన్ వీడండి.. భారతీయులకు సూచన.. ప్రత్యేక విమానాల్లో తరలింపు


పన్నా జిల్లాకే చెందిన సుశీల్ శుక్లా అనే వ్యక్తికి చెందిన కుటుంబం 20 ఏళ్ళ కిందట పన్నా శివారులోనే కొంత భూమిని లీజుకు తీసుకుని, వజ్రాల కోసం అన్వేషించారు. ఏళ్ల పాటు శ్రమించినా ఆవగింజంత డైమండ్ కూడా దొరకలేదు వాళ్లకి. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో వజ్రాల తొవ్వకం కోసం తీసుకున్న భూమిలోనే ఇటుకల వ్యాపారం మొదలుపెట్టారు. కృష్ణ కళ్యాణ్‌పూర్‌ ప్రాంతంలోని ఆ మట్టి ఇటుకల తయారీకి కూడా పనికొస్తుంది. అలా సుశీల్ శుక్లా తల్లిదండ్రులు రోజూ వెళ్లి ఇటుకల తయారీకి పనుల్ని చూసుకునేవాళ్లు. మొన్నొకరోజు మట్టిని తొవ్వుతుండగా వాళ్లకు వజ్రం దొరికింది.

Gurmeet Ram Rahim: రేపిస్టు డేరా బాబాకు Z-Plus కేటగిరీ భద్రత.. BJP సర్కార్ అనూహ్య ఉత్తర్వులు


20 ఏళ్ల కష్టం తర్వాత మట్టిలో దొరికిన వజ్రాన్ని చూసి ఆ వృద్ధ దంపతుల కళ్లు చెమ్మగిల్లాయి. ఇటుక బట్టీ యజమాని అయిన కొడుకు సుశీల్ కు వెంటనే సమాచారం అందించారు. పన్నా జిల్లాలో వజ్రాల సేకరణకు సంబంధించి కొన్ని నిబంధనలున్నాయి. లీజుకు తీసుకున్న భుముల్లో వజ్రాలు లభిస్తే గనుక వాటిని జిల్లా కలెక్టర్ కు అప్పగిస్తే, క్వాలిటీని బట్టి మార్కెట్ రేటు ప్రకారం వజ్రం దొరికిన వాళ్లకు డబ్బులు చెల్లించే విధానం కొనసాగుతోంది. సుశీల్ శుక్లా కూడా తన వజ్రాన్ని ప్రభుత్వాధికారులకు అందజేయగా.. అది..

Edible Oil Prices: వంట నూనెల ధరలు పెరిగాయి.. Ukraine Crisis దెబ్బకు భారీగా..


సుశీల్ శుక్లా కుటుంబానికి దొరికన వజ్రం స్వచ్ఛమైన 26.11 క్యారట్ల డైమండ్‌ గా అధికారులు నిర్ధారించారు. దాని విలువ రూ.1.26కోట్లు ఉంటుందని లెక్కలు కట్టాయి. అంటే ఒకేఒక్క వజ్రంతో సుశీల్ కుటుంబం ఒక్కరోజులోనే కోటీశ్వరులైపోయినట్లు లెక్క. అయితే, పన్నాలో వజ్రాల వేలం ప్రతి జనవరిలో నిర్వహిస్తుంటారు. మరి ఈ అరుదైన వజ్రాన్ని ఇప్పడే వేలం వేస్తారా? వచ్చే జనవరిలో అమ్మకానికి పెడతారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే,

Ukraine Crisis: పుతిన్ సంచలనం.. ఉక్రెయిన్‌ రెండు ముక్కలు.. ఇక యుద్ధాన్ని ఎవరూ ఆపలేరు!


వజ్రాన్ని వేలం వేసి.. ప్రభుత్వ రాయలిటీ, ట్యాక్సులు పోనూ మిగతాది అది దొరికిన సుశీల్ శుక్లాకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, సుశీల్ కుటుంబం వజ్రం దొరికిన ఆ భూమిని మరో ఐదుగురితో కలిసి లీజ్‌కు తీసుకున్నారట. కాబట్టే వచ్చేదాంట్లో వాళ్లకూ భాగం పంచక తప్పని పరిస్థితి. ఏదేమైనా వచ్చిన డబ్బుతో కొత్త బిజినెస్‌ మొదలుపెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు సుశీల్ శుక్లా.
Published by:Madhu Kota
First published:

Tags: Diamonds, Madhya pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు