Home /News /trending /

BREAKING UK FINANCE MINISTER RISHI SUNAK HEALTH SECRETARY SAJID PAH

Breaking: రాజీనామా చేసిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్.. కారణం అదే..

రిషి సునక్ (ఫైల్)

రిషి సునక్ (ఫైల్)

Britan: బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా, హెల్త్ సెక్రటరీ సాజిద్ జావిద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

బ్రిటన్ లో (Britan)  కీలక పరిణామాం సంభవించింది. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తు.. బ్రిటన్ ఆర్థిక మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టి బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మంగళవారం రాజీనామా చేశారు. బ్రిటన్ లో ఈ మధ్య కాలంలో అనేక రకాల అవినీతి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యలో దేశం ప్రయోజనం కోసం.. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.

ఇక ఈయన మార్గంలోనే.. హెల్త్ సెక్రటరీ సాజిద్ జావిద్ (Sajeed jawed) కూడా రిజైన్ చేశారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వీరు తీవ్రంగా ఎండగట్టారు. కోవిడ్ సమయంలో పార్టీ గేట్ లో పాల్గొని వివాదస్పదం అయినందుకు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రికి రిషి సునక్ లకు జరిమాన విధించిన విషయం తెలిసిందే. అదే విధంగా, స్లీజ్ కుంభకోణం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



వరుస కుంభకోణాల పరంపర నేపథ్యంలో.. జాన్సన్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిపాలించగలరనే సామర్థ్యంపై తనకు నమ్మకం పోయిందని జావిద్ అన్నారు. ఇకపై తన మనస్సాక్షిని చంపుకుని ఇక్కడ పనిచేయలేనని చెప్పాడు. అంతే కాకుండా.. బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఈ పరిస్థితి మారదనే విషయం, స్పష్టంగా అర్థమైందని చెప్పడానికి నేను చింతిస్తున్నట్లు మిస్టర్ జావిద్, బోరిస్ జాన్సన్ కు రాసిన లేఖలో తెలిపారు.

ఇదిలా ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేంద్రం ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఢిల్లీని పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. వర్షాకాల సమావేశాల రెండో రోజున ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీని పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చని, ఎన్నికలు ఉండబోవని చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.ఢిల్లీని పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తామని, తదుపరి ఎన్నికలు ఉండబోవని చర్చలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ బీజేపీ ఎమ్మెల్యేలతో సభలో చెప్పారు.

కేజ్రీవాల్‌ను ద్వేషించడం ద్వారా మీరు దేశాన్ని ద్వేషించడం ప్రారంభించారని బీజేపీపై మండిపడ్డారు. కేజ్రీవాల్ ముఖ్యం కాదని, దేశమే ముఖ్యమని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి భయపడుతున్నారని, అందుకే ఎన్నికలు కోరుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికలు ఆపేసి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఈ దేశం అంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. ఆప్‌ని బీజేపీ అదుపు చేయలేకపోతోందని, అందుకే ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలనే చర్చ నడుస్తోందన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Britan, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు