అతిపెద్ద అలపై సర్ఫింగ్... గిన్నీస్ రికార్డ్ బ్రేక్... వైరల్ వీడియో

Maya Gabeira Riding: బ్రెజిల్ మహిళ మాయా గాబెరా... 75.5 అడుగుల ఎత్తున్న అలపై సర్ఫింగ్ చేసి... తన వరల్డ్ రికార్డును తానే బ్రేక్ చేసి... సరికొత్త రికార్డ్ సృష్టించింది.

news18-telugu
Updated: September 13, 2020, 10:49 AM IST
అతిపెద్ద అలపై సర్ఫింగ్... గిన్నీస్ రికార్డ్ బ్రేక్... వైరల్ వీడియో
అతిపెద్ద అలపై సర్ఫింగ్... గిన్నీస్ రికార్డ్ బ్రేక్... (credit - twitter)
  • Share this:
Maya Gabeira Riding: ఎవరైనా అలలపై సర్ఫింగ్ చేస్తుంటే... చూడ్డానికి బాగుంటుంది... అదే అలలపై సర్ఫింగ్ చెయ్యాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అదుపు తప్పినా... అలాలో అల్లకల్లోలం అయిపోతాం. అలాంటిది బ్రెజిల్ సర్ఫర్... మాయా గాబెరా మాత్రం... అలలంటే చాలు సర్ఫింగ్‌తో విరుచుకుపడుతుంది. ఆమె చేసే సర్ఫింగ్ సాహసాల్ని ప్రజలు కళ్లప్పగించి చూస్తుంటారు. తాజాగా ఆమె 73.5 అడుగుల ఎత్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద అలపై అలవోకగా సర్ఫింగ్ చేసి... గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 2018లో ఇదే మాయా... 68 అడుగుల ఎత్తున్న అలపై సర్ఫింగ్ చేసి... ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. అప్పటి తన రికార్డును ఇప్పుడు తానే బ్రేక్ చేసి... సరికొత్త రికార్డ్ తన పేరున రాసుకుంది.


ఈ రికార్డు బ్రేకింగ్ ఈవెంట్ జరిగింది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో. కానీ... పూర్తి వివరాల్ని ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ బయటపెట్టింది. తమ ట్విట్టర్ పేజీలో ఈ ఫీట్ వీడియోను పోస్ట్ చేసింది. పోర్చుగల్‌లోని నజరేలో... దూసుకొస్తున్న అలపై ఆమె చేసిన విన్యాసం చూసి తీరాల్సిందే.

గాబెరాకి వరల్డ్ సర్ఫింగ్ లీగ్ నుంచి 2020 వుమన్స్ XXL బిగ్గెస్ట్ వేవ్ అవార్డు కూడా దక్కింది. మగవాళ్లలో ఇదే అవార్డు దక్కించుకున్న హవాయ్ సర్ఫర్ కాయ్ లెన్నీ... 70 అడుగుల ఎత్తున్న అలపై సర్ఫింగ్ చేశాడు. అంటే... మాయా... కాయ్ లెన్నీ అల కంటే... 5.5 అడుగులు ఎక్కువ ఎత్తున్న అలపై సర్ఫింగ్ చేసినట్లైంది.


"ఈ ఫీట్ చేసినప్పుడు నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఆ పెద్ద అల బాగుంది. అదే సమయంలో... చాలా భయపడ్డాను కూడా" అని మాయా తెలిపింది. 2 ఏళ్ల కిందట ఇలాగే చేశాక... అంతకంటే పెద్ద అలపై సర్ఫింగ్ చేయాలనుకున్న ఆమె... దాని కోసం 2 ఏళ్లు ఎదురుచూసింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదిరిపోయే కామెంట్స్ ఇస్తూ... ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం అని ఓ నెటిజన్ రాయగా... బ్రెజిల్ నుంచి వచ్చిన అద్భుతం అని మరొకరు తెలిపారు. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని ఎంతో మంది నిరూపించారు. మాయా రెండోసారి నిరూపించినట్లైంది.
Published by: Krishna Kumar N
First published: September 13, 2020, 10:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading