హ్యారీ పోటర్ స్కూటర్... పెట్రోల్, ఛార్జింగ్ అక్కర్లేదు... పైసా ఖర్చు లేదు... వైరల్ వీడియో

Broomstick Scooter: బ్రెజిల్‌లో ఇద్దరు కలిసి... సరికొత్త హ్యారీ పోటర్ స్కూటర్ తయారుచేశారు. అది భవిష్యత్ ప్రపంచ రవాణాను మార్చేయబోతోందని మనం అర్థం చేసుకోవచ్చు.

news18-telugu
Updated: November 15, 2020, 7:52 AM IST
హ్యారీ పోటర్ స్కూటర్... పెట్రోల్, ఛార్జింగ్ అక్కర్లేదు... పైసా ఖర్చు లేదు... వైరల్ వీడియో
హ్యారీ పోటర్ స్కూటర్... పెట్రోల్, ఛార్జింగ్ అక్కర్లేదు... పైసా ఖర్చు లేదు... (credit - youtube - reuters)
  • Share this:
Broomstick Scooter: రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకేమో... ఛార్జిగ్ చేయడానికి ఎక్కువ టైమ్ పట్టే పరిస్థితి. ఇవేమీ అవసరం లేకుండా... పైసా ఖర్చు లేకుండా వాహనం వెళ్తే... చాలా బాగుంటుంది కదూ... అదే బ్రూమ్ స్టిక్ స్కూటర్. మీరు హ్యారీ పోటర్ సినిమాలు చూసే ఉంటారు కదా. అందులో... బూజు దులిపే కర్రపై కూర్చొని... గాల్లో ఎగురుతుంటారు. అది చూసినప్పుడు... నిజంగా అలా జరిగితే భలే ఉంటుంది అనిపిస్తుంది మనకు. ఆ కలను నిజం చేశారు బ్రెజిల్ యువకులు వినిసియస్ శాంక్టస్, అలెస్సాండ్రో రస్సో. బూజు కర్రతో వెళ్లే స్కూటర్ తయారుచేశారు. ఇప్పటివరకూ మనం చూసిన స్కూటర్లు, బైకులకు ఇది భిన్నమైనది. దీనికి ఒకటే చక్రం ఉంటుంది.

తాము కనిపెట్టిన దానికి బ్రూమ్‌స్టిక్ స్కూటర్ (చీపురు కట్ట స్కూటర్ లేదా బూజు కర్ర స్కూటర్) అని పేరు పెట్టారు. ఈ స్కూటర్ చక్రంలో మోటర్ ఉంటుంది. సిటీ రోడ్లపై వెళ్లేందుకు... ఈ కర్రే స్టీరింగ్ లా కూడా పనిచేస్తుంది. చేయాల్సినదల్లా... ఎటు వెళ్లాలో అటు కర్రను తిప్పితే చాలు... ఆటోమేటిక్ గా చక్రం అటే వెళ్తుంది. అలాగే... చక్రం ముందుకు వెళ్లేందుకు... దానిపై కూర్చున్న వ్యక్తి కాస్త ముందుకు వంగితే చాలు... ఆటోమేటిక్‌గా చక్రం ముందుకు కదులుతుంది. ఒకే చక్రంపై వెళ్లడం మొదట్లో కాస్త కష్టంగానే ఉంటుంది. ప్రాక్టీస్ అయ్యాక మాత్రం చాలా ఈజీగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: అపోఫిస్ మార్గాన్ని మళ్లీ లెక్కేసిన శాస్త్రవేత్తలు. యుగాంతం తప్పదని అంచనా

ఈ స్కూటర్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. రోజువారీ అవసరాలకు దీన్ని వాడుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి కాలుష్యమూ ఉండదు. దీనిపై వెళ్తుంటే... గాల్లో తేలుతున్నట్లే ఉందని అలెస్సాండ్రో తెలిపాడు.

మొదట్లో తమ అవసరాలకోసమే దీన్ని తయారుచేసిన ఈ ఇద్దరూ... చాలా మంది దీన్ని అడుగుతుండటంతో... త్వరలోనే దీన్ని మార్కెట్‌లో రిలీజ్ చేస్తామంటున్నారు. ఒక్కో స్కూటర్ రేటు రూ.50,000 దాకా ఉంటుందనే అంచనా ఉంది. ఈ స్కూటర్... మామూలు రోడ్డుపై, డౌన్ రోడ్డుపై వెళ్లగలదు గానీ... ఎత్తు ఎక్కదు. కాబట్టి... మరికొన్ని మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా... వాహన రంగంలో ఇదో సంచలనంగా ఇప్పుడు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరెంతో మంది ఇలాంటి స్కూటర్లను వాడే రోజులు వస్తాయంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: November 15, 2020, 7:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading