ప్రాక్టీస్ సెషన్‌లో వింత... ప్లేయర్ తలపై వాలిన రామచిలుక... వైరల్ వీడియో

Viral Video: మనుషుల్ని చూస్తే పక్షులు పారిపోతాయి. ఆ రామచిలుక మాత్రం... ఏకంగా ప్లేయర్ తలపై వచ్చి వాలింది. ఆ తర్వాత ఏం చేశారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 23, 2020, 8:40 PM IST
ప్రాక్టీస్ సెషన్‌లో వింత... ప్లేయర్ తలపై వాలిన రామచిలుక... వైరల్ వీడియో
ప్రాక్టీస్ సెషన్‌లో వింత... ప్లేయర్ తలపై వాలిన రామచిలుక... వైరల్ వీడియో (credit - instagram)
  • Share this:
బ్రెజిల్‌లో జరిగిందీ ఘటన. అక్కడి మహిళా జాతీయ ఫుట్‌బాల్ టీమ్... ప్రాక్టీస్ సెషన్‌లో తలమునకలైంది. ప్రాక్టీస్ సెషన్ అంటే... అల్లాటప్పగా ఉండదక్కడ. అసలే బ్రెజిలియన్స్‌కి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ప్రాక్టీస్ మ్యాచైనా... సీరియస్‌గానే ఆడతారు. అలా సీరియస్‌గా ఆడుతున్న సమయంలో... పెద్ద రామచిలుక ఒకటి... ఎగురుకుంటూ వచ్చి... మహిళా ప్లేయర్ బర్నా బెనైట్స్ తలపై వాలింది. అది ప్యారట్ అని తెలిసి... ఆమె చాలా ఆశ్చర్యపోయింది. మిగతా ప్లేయర్లు కూడా "అరే ఇదేంటి ఇలా వచ్చింది. దీన్ని ఎవరైనా పెంచుకుంటున్నారేమో... అందుకే మనుషుల దగ్గరకు వచ్చేసింది" అని అనుకున్నారు. వెంటనే మరో వ్యక్తి... ఆ రామ చిలుకను అక్కడి నుంచి జాగ్రత్తగా పంపించారు. అది అలా ఎగురుతూ... గోల్ పోస్ట్ అవతలకు వెళ్లిపోయింది. ఇదంతా వీడియోలో రికార్డైంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా... 40వేల మందికి పైగా చూశారు. 10వేల మందికి పైగా లైక్ చేశారు.

వేల ప్రాణులు తమ ప్రాణాలు కోల్పోతున్నాయి. అడవుల్లో కార్చిచ్చుల వంటివి వాటికి హాని చేస్తున్నాయి. అలా జరగకపోయి ఉంటే... ఇలాంటి దృశ్యాలు మనకు కనిపించవు. ప్రకృతిని కాపాడాలి. అదే మనకు అతి పెద్ద ఆస్తి అని బర్నా బెనైట్స్... వీడియోకి కాప్షన్ పెట్టారు. ఈమధ్య అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ రెయిన్ ఫారెస్టులో పెద్ద ఎత్తున కార్చిచ్చులు రేగి... మంటల్లో అడవులు తగలబడ్డాయి. లక్షల ప్రాణులు చనిపోయాయి. అందువల్లే బెనైట్స్ తన కాప్షన్‌లో ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు.
అసలా చిలుక ఎక్కడిదని ఆరా తియ్యగా అసలు విషయం తెలిసింది. అది... రియోడీ జనీరోలోని... గ్రాంజా కోమరీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్యామిలీతో ఉండేది. దాన్ని వాళ్లు బాగా చూసుకుంటున్నారు. ఈమధ్య ఎక్కువగా బయటకు వెళ్తున్న ఆ చిలుక... దారి తప్పి... ఇలా గోల్ పోస్ట్ వైపు వచ్చేసింది. ఫలితంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

బెనైట్స్ 2012లో లండన్ ఒలింపింక్ గేమ్స్‌లో బ్రెజిల్ తరపున నేషనల్ ఫుట్ బాల్ టీమ్‌లో ఆడింది. ఐతే... లిగమెంట్ గాయం కారణంగా... 2015 ఫిబ్రవరిలో జరిగిన ఫిఫా మహిళా వరల్డ్ కప్‌లో ఆడలేకపోయింది. ప్రస్తుతం ఆమె క్లబ్ ఇంటర్నేషనల్ కోసం ఆడుతోంది.
Published by: Krishna Kumar N
First published: September 23, 2020, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading