Viral Video: తొడలతో 12 కేజీల పుచ్చకాయను నలిపేసిన మహిళ.. ఒక్క సెకన్‌లోనే ఫసక్.. బాబోయ్ ఏంటా కండలు..

తొడలతో పుచ్చకాయను నలిపేసిన అల్వీస్ (Image:Truly/Youtube)

120-130 కేజీల బరువుతో అలవోకగా స్క్వాట్స్ చేస్తారు అల్వీస్. ఓసారి 150 కేజీల బరువుతో స్క్వాట్స్ చేసి రికార్డు సృష్టించారు. ట్రూలీ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  • Share this:
    దేహ దారుఢ్యం.. కండ బలం.. మగవారికే ఉంటాయని మనలో చాలా మంది అనుకుంటారు. మగవారితో పోల్చితే ఆడవారికి శక్తతి తక్కువగా ఉంటుందని భావిస్తారు.  కానీ కాలం మారింది.  పురుషులతో అన్ని రంగాల్లోనూ మహిళలు పోటీపడుతున్నారు.  బాడీ బిల్డింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు. కండలు తిరిగిన శరీరంతా ఔరా అనిపిస్తున్నారు. ఇక్కడున్న మహిళ కూడా అలాంటి కోవలోకే వస్తారు. మగవారు కూడా కుళ్లుకునేంతలా ఆమె కండలు పెంచింది. ఆ ఫిట్‌నెస్.. బాడీ బిల్డింగ్ చూస్తే.. అసలు మహిళేనా అన్న అనుమానం కలుగుతుంది.  ఆమె పేరు అలెసాండ్రా అల్వీస్. మనకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ.. బ్రెజిల్‌లో చాలా ఫేమస్. బ్రెజిల్ క్వాడ్జిల్లా అని కూడా ఆమెను పిలుస్తారు. అల్వీస్ దేహ దారుఢ్యానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆమె ఓ అద్భుతమైన ఫీట్ సాధించారు. 12 కేజీలున్న పుచ్చకాయను తొడల మధ్యలో ఉంచి కేవలం ఒక్క సెకన్‌లోనే నలిపేశారు. కండలు తిరిగిన తన తొడలతో దాన్ని ముక్కలు ముక్కలు చేశారు

    ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా బాబోయ్.. ఏంటా కండ బలం అంటూ కామెంట్ చేస్తున్నారు. మగవారికి కూడా సాధ్యం కాని ఫీట్ చేశావ్.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


    అలెసాండ్రా అల్వీస్ తన 14వ ఏట నుంచే ఫిట్‌నెస్ ట్రైనింగ్ మొదలుపెట్టారు. ఫిట్‌నెస్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అల్వీస్..ఆ తర్వాత బాడీ బిల్డింగ్‌ వైపు వెళ్లారు. భారీ బరువులతో స్క్వాట్స్ చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. జిమ్‌లో ఎక్కువగా స్క్వాట్స్ ప్రాక్టీస్ చేయడంతో ఆమె తొడలు కండలు తిరిగి బలంగా తయారయ్యాయి. 120-130 కేజీల బరువుతో అలవోకగా స్క్వాట్స్ చేస్తారు అల్వీస్. ఓసారి 150 కేజీల బరువుతో స్క్వాట్స్ చేసి రికార్డు సృష్టించారు. ట్రూలీ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

    అలెసాండ్రా అల్వీస్ ఇన్‌స్టగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు దాదాపు 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమెకు వచ్చే ఆదాయంలో ఎక్కవ భాగం ఇన్‌స్టగ్రామ్ నుంచి వస్తుంది. ఆమె చేసిన మొదటి వీడియోకే 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. మొదట ఆమెను చాలా మంది విమర్శించేవారు. ఇలాంటి సాహసాలు అవసరమా అని తిట్టేవారు. కానీ తర్వాత చాలా మంది ఆమెను మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో ఓ మహిళ పుచ్చకాయను పగులకొట్టే వీడియోను చూశానని.. ఆమె కంటే తనకే ఎక్కువ బలం ఉందని తెలిపింది. అందుకే 12 కేజీల వీడియో సెకన్‌లో పగులకొట్టి శభాష్ అనిపించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: