హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం బ్రెజిల్ రామాయణ రాయబారం.. హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్లు..

Hydroxychloroquine : కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రస్తుతం సంజీవనిలా పనిచేస్తున్న మందు ఏదైనా ఉందంటే అది హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక్కటే.

news18-telugu
Updated: April 8, 2020, 11:25 AM IST
హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం బ్రెజిల్ రామాయణ రాయబారం.. హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Hydroxychloroquine : కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రస్తుతం సంజీవనిలా పనిచేస్తున్న మందు ఏదైనా ఉందంటే అది హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక్కటే. ఆ మందును భారత్ పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది. అయితే, కరోనా వ్యాధి విజృంభించడంతో దాన్ని ఎక్కువగా వాడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దానిపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో క్లోరోక్విన్‌ను తమకు ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరితే ఇచ్చేది లేదని స్పష్టం చేశారు మోదీ. అయితే, కరోనా వ్యాప్తి మరింత ఎక్కువవడంతో కొన్ని దేశాల అభ్యర్థనతో క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు సమ్మతించింది కేంద్రం.

అయితే, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం బ్రెజిల్ మోదీ ప్రభుత్వానికి రామాయానాన్ని రిఫరెన్స్‌గా వాడింది. లంకలో మూర్ఛపోయిన లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్లు, ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనాను తరిమేసేందుకు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సానారో లేఖ రాశారు. ఆ లేఖలో సంజీవని గురించి వ్యాఖ్యానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంది.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading