మన దేశం అభివృద్ధి చెందినట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ నిరుపేదలు అలాగే ఉంటారు. కుల, మత విధ్వేషాలూ అలాగే ఉంటాయి. ఇక వాటిని అడ్డం పెట్టుకొని.. ప్రజలను రెచ్చగొట్టి క్యాష్ చేసుకోవాలని చూసే వారూ ఉంటారు. ముఖ్యంగా తరచూ హిందూ మతం, కులాలపై ఇలాంటి దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ది బేకింగ్ స్టూడియో (The baking studio).. ఓ ప్రైవేట్ సెరెమనీ కోసం.. బ్రాహ్మణ కుకీస్ తయారుచేసింది. ఆ కుకీస్‌పై బ్రాహ్మణులు జంధ్యం ధరించినట్లుగా కూడా ఉంది. ప్రత్యేక వేడుకల కోసం తాము ఇలాంటి కుకీస్ తయారుచేస్తామని ఆ సంస్థ తెలిపింది.
ఓ ప్రైవేట్ వేడుక కోసం వీటిని తయారుచేసినా.. ఓ కులానికి సంబంధించినట్లుగా అవి ఉండటంతో.. పెద్ద దుమారం రేగింది. ట్విట్టర్‌లో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. "కుల ఆధిపత్యం ప్రదర్శించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు" అని ఓ యూజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Anyone up for freshly-baked Brahmin cookies? pic.twitter.com/3c8mudDcPc
— ah, see... (@chippdnailss) January 27, 2023
babe wake up new casteist tenali rama cookies dropped https://t.co/ypKv4d4wAs
— akshansh (@peepeepoopoo241) January 28, 2023
babe wake up new casteist tenali rama cookies dropped https://t.co/ypKv4d4wAs
— akshansh (@peepeepoopoo241) January 28, 2023
ఈమధ్య ఇలాంటిదే మరో వివాదం చెలరేగింది. ట్విట్టర్‌లో ప్యూర్-వెజ్ (పరిశుద్ధ శాఖాహారం) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. రెస్టారెంట్లు.. ఇలాంటి సందేశాలను ప్రదర్శించడంపై ఓ యూజర్ అభ్యంతరం చెప్పడంతో.. దీనిపై డిబేట్ జరిగింది. ఆ యూజర్ అభ్యంతరం ఏంటంటే... వెజ్ తినని వారు తింటున్న ఆహారం పరిశుద్ధమైనది కాదా అని ప్రశ్నించారు. నాన్-వెజ్ తినేవారిని అవమానపరుస్తున్నారని అనడంతో దీనిపై డిబేట్ కొనసాగి.. ట్రెండింగ్ అయ్యింది.
ఇది కూడా చదవండి : Dinosaurs : తెలుగు రాష్ట్రాల్లో రాక్షస బల్లులు తిరిగాయా? అక్కడ డైనోసార్ పార్క్!
అంతకంటే ముందు కూడా ఇలాంటి అంశం ఒకటి హాట్ టాపిక్ అయ్యింది. ట్విట్టర్‌లోని @peeleraja అకౌంట్‌లో ట్వీట్ వైరల్ అయ్యింది. బెంగళూరులోని కొన్ని రెస్టారెంట్లు, కేఫ్స్.. తమ పేర్ల ముందు బ్రాహ్మిన్ అని.. జొమాటో, స్విగ్గీ లాంటి వాటిలో పెడుతున్నారని చెబుతూ.. కొన్ని ఈటరీల ఫొటోలు పోస్ట్ చేయడంతో దానిపైనా చర్చ జరిగింది.
ఇలా రెస్టారెంట్లు, కేఫ్‌లు చేస్తున్న సొంత ప్రయోగాలు వివాదాలకు దారితీస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.