హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video : ఒక్కసారి కరుణించమని అమ్మాయిలను కాళ్లు పట్టుకున్నఅబ్బాయిలు .. వీడియో ఇదిగో

Viral video : ఒక్కసారి కరుణించమని అమ్మాయిలను కాళ్లు పట్టుకున్నఅబ్బాయిలు .. వీడియో ఇదిగో

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral video: రాజస్థాన్‌లో కాలేజీ అమ్మాయిల కాళ్లు పట్టుకొని అబ్బాయిలు వేడుకున్నారు. ఈ ఒక్కసారికి మాపై దయ ఉంచమని కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ కాలేజీ అబ్బాయిలు అమ్మాయిల కాళ్లపై ఎందుకు పడ్డారో ఈ వీడియో చూడండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

గతంలో కాలేజీ(College)కి అమ్మాయిలు వచ్చినా, వెళ్తున్నా అబ్బాయిలు వెంట పడుతూ ఆటపట్టించే వాళ్లు. వాళ్లను ర్యాగింగ్(Raging), టీజింగ్(Teasing), పేరుతో కొంటె పనులు, చిలిపి చేష్టలతో ఇబ్బంది పెట్టేవారు. రాజస్థాన్‌(Rajasthan)లో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరిగింది. అమ్మాయిలు కాలేజీ నుంచి వెళ్తుంటే అబ్బాయిలు వాళ్ల కాళ్లు పట్టుకోవడం, కింద పడి చేతులు జోడించి నమస్కారం చేయడం చేశారు. అమ్మాయిలు వదలండ్రా బాబు అని విదిలించుకున్న వదిలిపెట్టకుండా కాళ్లు అందకపోతే చెప్పులు పట్టుకొని ఏదో కావాలని వేడుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో(Video)నే సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వైరల్ (Viral)అవుతోంది.


Powerlifter: ఒకప్పుడు పని మనిషి, ఇప్పుడు పవర్‌లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇది కదా సక్సెస్ అంటే..అమ్మాయిల్ని వదలని స్టూడెంట్స్..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నగరంలోని మహరాణి శ్రీజయ కాలేజీ ఉంది. అక్కడ కాలేజీలో అమ్మాయిలు వెళ్తుంటే అబ్బాయిలు అమ్మాయి కాళ్ల, వేళ్ల పడుతూ బ్రతిమిలాడుతున్న దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో హల్‌ చేస్తున్నాయి. వీడియో చూస్తే అందరు ప్రేమించమని అమ్మాయిల వెంట పడుతున్నారా ఏంటీ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాని కాస్త వీడియోని డీప్‌గా చూస్తే ..అప్పుడు అర్ధమైంది. కాలేజీలో స్టూడెంట్స్‌ యూనియన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అమ్మాయిల కాళ్ల , వేళ్ల పడుతున్నది ఎందుకంటే ప్రేమించమని కోరడానికి కాదు మీ ఓటు మాకే వేయమని కోరుతూ ఈవిధంగా ప్రాధేయపడుతున్నారు.కాళ్లు పట్టుకొని వేడుకోలు..

క్లాసులో, కాలేజీ క్యాంపస్‌తో పాటు చివరకు స్టూడెంట్స్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్న ఏబీవీపీ ప్రెసిడెంట్ అభ్యర్థి పవన్ ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ అభ్యర్థి కౌశల్ ఫౌజ్దార్‌తో పాటు పోటీ చేస్తున్న మరికొందరు రోడ్డుపై కూర్చొని క్యూలో నిలబడి ఓటర్లను వివిధ రకాలుగా వేడుకుంటూ ఓట్లు అడిగారు.ఇప్పుడు ఈ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న వీడియో ..

కాలేజీలో ఓట్ల కోసం స్టూడెంట్స్ యూనియన్ లీడర్లు కాళ్లు, వేళ్లు పట్టుకోవడం చూసి అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు. వదిలేయండి బాబు మీకే ఓటు వేస్తాం మా కాళ్లు పట్టుకోకండి అంటూ వదిలించుకొని పరిగెత్తుతున్న వెంటపడ్డారు. అందురు కుర్రాళ్లు మీరు ఇప్పుడిలాగే చెప్పి చివరకు ఓట్లు వేయకపోతే ఫలితాల్లో ఓడితే మేం తలెత్తుకోలేమని బాధపడుతూ చెప్పడం చూసి అమ్మాయిలు నవ్వుకున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Rajasthan, Trending news, Viral Video

ఉత్తమ కథలు