కొన్ని ప్రేమ పెళ్లిళ్లు చూస్తే ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. బీహార్(Bihar)లో ఓ ప్రేమజంట గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పెళ్లికి అబ్బాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ..ఇద్దరూ రహస్యంగా కలుస్తూ ఉండేవాళ్లు. రెండ్రోజుల క్రితం కూడా ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు (Boyfriend) అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. శబ్ధం కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు,స్థానికులకు దొరకకుండా పక్కనే ఉన్న బావి(Well)లో దూకాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడ్ని సేఫ్‌గా బావిలోంచి బయటకు తీసి కొట్టబోయారు. యువతి అతడ్ని పెళ్లి కోవడం ఇష్టమని చెప్పడంతో గ్రామస్తుల సమక్షంలోనే పెళ్లి(Wedding)చేశారు.
హై ఓల్టేజ్ లవ్ డ్రామా..
బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఓ ప్రియుడు తన ప్రియురాలి పెళ్లి చేసుకోవడం కోసం బావిలో దూకాడు. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిచ్లా తెల్పా ప్రాంతానికి చెందిన మున్నారాజ్ అనే యువకుడు మోతిరాజ్‌పూర్‌కి చెందిన సోనికుమారిని ప్రేమించాడు. ఇద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండటంతో తరచూ రహస్యంగా కలుస్తూ ఉండేవాళ్లు. ప్రేమ పెళ్లికి రెడీ అయినప్పటికి అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నాలుగేళ్లుగా సీక్రెట్‌గా కలుసుకునే వాళ్లు. ఆదివారం అర్ధరాత్రి మున్నారాజ్ తన ప్రియురాలు సోనికుమారిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి కావడంతో యువతి బంధువులు మున్నారాజ్‌ని పట్టుకున్నారు. ఈక్రమంలోనే అతను ఇంటి ఆవరణలో ఉన్న బావిలో దూకాడు.
లవర్ కోసం బావిలో దూకిన ప్రియుడు..
బావిలో దూకిన మున్నరాజ్‌ని కాపాడేందుకు సోనికుమారి తల్లిదండ్రులతో పాటు స్థానికులు తాడు సహాయంతో అతడ్ని బావిలోంచి బయటకు తీశారు. అటుపై అతడిని మందలించే ప్రయత్నం చేయడంతో పెళ్లి చేసుకుంటానని ..ఇద్దరం కలిసి జీవిస్తామని చెప్పడంతో గ్రామస్తుల సమక్షంలోనే ఇద్దరికి వివాహం చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు. అయితే ఈ ప్రేమ వివాహానికి అబ్బాయి కుటుంబ సభ్యులు రాలేదు. ప్రేమ పెళ్లి చేసుకోవాలన్న తమ కోరిక తీరడం లేదని యువకుడు మున్నారాజ్ ఈ హై ఓల్టేజ్ లవ్ డ్రామా నడిపించినట్లుగా పోలీసులు తెలిపారు.
ఆ విధంగా పెళ్లైంది..
నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న తమకు పెళ్లి చేయడంపై మున్నారాజ్, సోనికుమార్ గ్రామస్తులు, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. మొదట కేసు నమోదు చేసుకున్న గర్ఖా పోలీసులు తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారని తెలిసి వెనక్కి వెళ్లిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Love marriage, Viral Video